Rajamouli: ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో దర్శకుడిగా అవతరించిన రాజమౌళి ఆ తర్వాత చేసిన సినిమాలతో మాస్ డైరెక్టర్ గా ఎదిగాడు. చాలా తక్కువ సమయంలోనే స్టార్ డైరెక్టర్ హోదాని అందుకున్న ఆయన అప్పటినుంచి ఇప్పటివరకు తన సినిమాలతో రేంజ్ ను పెంచుకుంటూ వస్తున్నాడు. సినిమా సినిమాకి తన మార్కెట్ ను విస్తరించుకుంటూ వస్తున్న ఆయన ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమా ఇండస్ట్రీని సైతం శాసించే స్థాయికి ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నాడు… సినిమాల విషయం పక్కనపెడితే పర్సనల్ విషయాల్లో రాజమౌళి ఏది పెద్దగా అట్టించుకోడట. కారణం ఏంటి అంటే ఆయనకు సంబంధించిన మొత్తం వర్క్స్ అన్ని తన భార్య అయిన రమా రాజమౌళి చేసి పెడుతోంది. కాబట్టి ఆయన ఓన్లీ సినిమా మీదనే ఫోకస్ చేసి సినిమాని ఎలా చేయాలి? నెక్స్ట్ ఆ సినిమాకి మార్కెటింగ్ ఎలా తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఆలోచిస్తూ ఉంటాడట. మొత్తానికైతే రాజమౌళి తన ఎంటైర్ కెరియర్ లో చేసిన సినిమాలన్నింటితో ఇప్పటివరకు ఆయన 2000 కోట్ల వరకు ఆస్తులైతే కూడగట్టినట్టుగా తెలుస్తోంది.
ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆయనకు కొన్ని అప్పులు కూడా ఉన్నాయట. బాహుబలి రీ రిలీజ్ సమయం లో ప్రమోషన్స్ లో భాగం గా ప్రభాస్ రాజమౌళి గురించి ఆసక్తికరమైన విషయాలైతే చెప్పాడు. అందులో తనకి చాలా అప్పులున్నాయని చెప్పడం విశేషం…ఇక దానికి ఊతమిస్తూ అసలు రాజమౌళికి అప్పులు ఎందుకు అయ్యాయి అనే విషయంలోనే కొన్ని అభిప్రాయలైతే వెలువడుతున్నాయి.
తన కొడుకు అయిన కార్తికేయ కొన్ని బిజినెస్ లకు సంబంధించిన పనులు చేయడం వల్ల ఆ బిజినెస్ లలో లాస్ వచ్చిందట. అందువల్లే భారీగా నష్టపోయినట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఇప్పుడు ఆ లాసెస్ ని కవర్ చేసుకొని మరి నిలదొక్కుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక మహేష్ బాబు సినిమాకి తన కొడుకు అయిన కార్తికేయ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా ఇంట్రడ్యూస్ చేస్తుండటం విశేషం…
ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళు ప్రొడ్యూసర్ అంటే డబ్బులు పెడతారా? లేదంటే క్రియేట్ థాట్స్ తోనే వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా కొనసాగుతారా? అనేది తెలియాల్సి ఉంది. ఇక 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో రాజమౌళి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఎలాగైనా సరే ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించి 3000 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…