Ugrabatti Cave Chinnamasta Devi: మహేష్ బాబు(Superstar Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వారణాసి'(Varanasi Movie) మూవీ చిత్రం ఆడియన్స్ లో ఒక్కసారిగా అంచనాలు ఎవ్వరూ ఊహించనంత రేంజ్ కి వెళ్ళిపోయింది. నిన్న రామోజీ ఫిలిం సిటీ లో అట్టహాసంగా జరిగిన #Globetrotter ఈవెంట్ లో వేలాది మంది అభిమానుల సమక్ష్యం లో విడుదల చేసిన ‘ది వరల్డ్ ఆఫ్ వారణాసి’ వీడియో ఆడియన్స్ కి రోమాలు నిక్కపొడుచుకునేలా చేసింది. ఈ వీడియో లో మనం చూసిన విజువల్స్ మొత్తం AI ద్వారా క్రియేట్ చేయబడినవే. రాజమౌళి కేవలం ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే తన విజన్ ని ఈ వీడియో ద్వారా ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేసాడు అంతే. ఆయన విజన్ లోని విజువల్స్ కి ప్రాణరూపం వస్తే మాత్రం మరో వెండితెర అద్భుతాన్ని ఆవిష్కరించిన వాడు అవుతాడు రాజమౌళి. ఇకపోతే ఈ గ్లింప్స్ వీడియో లో ఎన్నో ప్రత్యేకమైన ప్రదేశాలు చూపించారు.
అందులో ‘ఉగ్రబట్టి కేవ్’ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఇందులో కొలువున్న అమ్మవారి పేరిట చిన్నమస్తా దేవి. ఈమె చూసేందుకు భయంకరమైన ఆకారం లో ఉంటుంది. కానీ ఆమె ఒక కారణమూర్తి. చిన్న అంటే ఖండించబడిన, మస్తా అంటే శిరస్సు. చిన్నమస్తా అంటే ఖండించబడిన శిరస్సు లాగా ఉంటుంది కాబట్టి, ఈ అమ్మవారికి చిన్న మస్తా దేవి అనే పేరు పెట్టారు. ఈమె తన శిరస్సు ని తానే ఖండించుకొని, ఎడమ చేతిలో తన తలను, కుడిచేతిలో ఖడ్గాన్ని పట్టుకొని ఉంటుంది. ఈ అమ్మవారు ముండెమాలని ధరించి ఉంటారు. అదే విధంగా ఒక పెద్ద సర్పాన్ని జంజ్యంగా వేసుకొని ఉంటారు. ఖండించబడిన ఆమె మెడ నుండి మూడు రక్త ధారలు వస్తూ ఉంటుంది. మధ్య ధార ని తన ఖండిత శిరస్సు తో తాగుతుంది, అదే విధంగా కుడివైపు, ఎడమ వైపు నుండి వచ్చే రక్త ధారలను జయ, విజయ తాగుతూ ఉంటారు.
ఈ జయ ని డాకిని అని కూడా పిలుస్తూ ఉంటారు. అదే విధంగా విజయ ని వర్ణిని అని పిలుస్తుంటారు. ఈ ఇతివృత్తం మొత్తం రోమాలు నిక్కపొడుచుకునే విధంగా ఉంటుందట. సినిమాలో ఈ కేవ్ గురించి ఎంత చూపిస్తారో తెలియదు కానీ, ఈమె గురించి ప్రత్యేక కథనాలు యూట్యూబ్ మరియు గూగుల్ లో చాలానే ఉన్నాయి ఒకసారి చూడండి. దేవుడి మీద నమ్మకం, ఇష్టం లేదని బహిరంగంగా చెప్పుకొని తిరిగే రాజమౌళి, నిజాయితీగా దేవుడి మీద సినిమా చేస్తున్నప్పుడు ఎంత రీ సెర్చ్ చేసాడో మీరు అర్థం చేసుకోవచ్చు. గ్లింప్స్ లో రామాయణం కి సంబంధించి ఆయన చూపించిన కొన్ని విజువల్స్ వందేళ్ల ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఏ డైరెక్టర్ కూడా చూపించలేదు. వెండితెర మీద ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడు ఆడియన్స్ కి ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఊహించుకోవచ్చు.
Chinnamastha Devi #VARANASI pic.twitter.com/nuMVtRZMIa
— Chanandler Bong (@TheBongChh) November 15, 2025