Keeravani: ఒక సినిమా సక్సెస్ లో కథ, కథనం, దర్శకత్వంతో పాటు మ్యూజిక్ కూడా కిస్స్ పాత్ర వహిస్తోంది. ఇక ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలన్నీ బ్యా గ్రౌండ్ స్కోర్ తోనే సూపర్ సక్సెస్ ని సాధిస్తున్నాయి. రజినీకాంత్ హీరోగా వచ్చిన జైలర్ సినిమా సైతం బ్యాగ్రౌండ్ స్కోర్ వల్లే భారీ సక్సెస్ ను సాధించిందని సినిమా యూనిట్ సైతం ఒప్పుకోవడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా బ్యా గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఇప్పుడు అంత కీలకంగా మారిపోయింది. ఇలాంటి సందర్భంలోనే రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమా కోసం ఎం ఎం కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్న విషయం మనకు తెలిసిందే. రాజమౌళి ఇప్పటివరకు చేసిన 12 సినిమాల్లో 12 సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణి వ్యవహరించడం విశేషం… వీళ్లిద్దరి కాంబినేషన్ కు చాలా మంచి గుర్తింపైతే ఉంది. వీళ్ళ కాంబోలో వచ్చిన మూవీస్ ఆల్బమ్స్ కూడా సూపర్ సక్సెస్ ని సాధించడంతో వీళ్ళ పైన ప్రేక్షకులకు అంచనాలైతే భారీ గా పెరిగిపోయాయి. ఇక వారణాసి సినిమా నుంచి సవారీ అనే సాంగ్ వచ్చింది దానికి మంచి గుర్తింపైతే వచ్చింది.
ఇక నిన్న గ్లోబ్ ట్రిట్టర్ పేరుతో నిర్వహించిన ఈవెంట్లో విలన్ పృథ్వీ రాజ్ సుకుమారన్ ‘కుంభ’ ఇంట్రడక్షన్ కు సంబంధించిన బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో గానీ ఆయన కొంతవరకు కేర్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కానీ ఇకమీదట రాబోయే సాంగ్స్ విషయంలో కూడా ఆయన చాలా కేర్ఫుల్ గా ఉండాలి. లేకపోతే మాత్రం కాపీ చేశారు అంటూ ట్రోల్స్ ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు.
కీరవాణి ప్రస్తుతం ఇప్పుడు ఏ సినిమాలు చేయకుండా రాజమౌళి సినిమాల మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. కాబట్టి ది బెస్ట్ అవుట్ ఫుట్ ఇవ్వడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది… నిజానికి కీరవాణి కనక మ్యూజిక్ తో పాటు బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అల్టిమేట్ గా ఇచ్చినట్లయితే ఈ సినిమా సక్సెస్ అనేది చాలా ఈజీ అవుతోంది. అలాగే కలెక్షన్స్ విషయంలో కూడా ఈ సినిమా భారీ రేంజ్ లో కలెక్షన్స్ కొల్లగొడుతోందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
కాబట్టి ఆయన మ్యూజిక్ ఎలా ఇస్తాడు అనేదే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. రాజమౌళి డైరెక్షన్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరమైతే లేదు. ఆయన ఆ విషయంలో చాలా క్లారిటీగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతాడు. కాబట్టి అందులో ఎలాంటి సందేహం ఉండదు. కానీ కీరవాణి దెబ్బేస్తే మాత్రం సినిమా మొత్తానికి బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తోంది అనేది…