Bigg Boss 8 Telugu: నాగార్జునకి బిగ్ బాస్ షో చూసేంత తీరిక ఉందా..? మరి వీకెండ్ లో కంటెస్టెంట్స్ చేసిన తప్పుల గురించి ఎలా మాట్లాడుతున్నాడు…

ప్రస్తుతం ప్రేక్షకుడిని ఎంటర్ టైన్ చేయడానికి చాలా ప్లాట్ ఫామ్స్ ఉన్నాయి. అందుకే ఏదైతే వాళ్ళను పూర్తి స్థాయిలో ఎంటర్ టైన్ చేయగలవు అని వాళ్ళు నమ్ముతారో అలాంటి సినిమాలు, షో లనే చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు...

Written By: Gopi, Updated On : September 24, 2024 10:57 am

Bigg Boss 8 Telugu(54)

Follow us on

Bigg Boss 8 Telugu: తెలుగు టెలివిజన్ రంగంలో అత్యధిక టిఆర్పి రేటింగ్ ని సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతున్న షోలలో ‘బిగ్ బాస్ షో’ మొదటి స్థానంలో ఉంటుంది. ఇక ప్రస్తుతం ‘బిగ్ బాస్ సీజన్ 8’ ప్రసారం అవుతున్న క్రమంలో ఈ షో ప్రస్తుతం అందరిలో ఒక అటెన్షన్ ని క్రియేట్ చేస్తుంది. నిజానికి గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ కి చాలా మంచి ఆదరణ అయితే దక్కుతుంది. దానివల్ల ప్రేక్షకుల్లో కూడా బిగ్ బాస్ షో అనేది రియాల్టీగానే జరుగుతుంది. ఇందులో ఎలాంటి పక్షపాతలు చూపించడం లేదు అనే రీతిలో అందరిలో నమ్మకం అయితే కలుగుతుంది. ఇక దానికి తోడుగా నాగార్జున కూడా ఈ సీజన్ లో అనుసరిస్తున్న తీరైతే బావుంది. గత సీజన్లలో నాగార్జున కొంత మందిని సపోర్ట్ చేస్తూ మాట్లాడినట్టుగా అనిపించేది. కానీ ఇప్పుడు మాత్రం ఎవరు తప్పు చేసిన కూడా వాళ్ళు చేసింది తప్పు అని చెప్తున్నాడు. ఇది ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ఇక ఇదిలా ఉంటే అందరికీ ఉన్న ఒక డౌట్ ఏంటి అంటే ఈ షో లో వీక్ మొత్తం కంటెస్టెంట్లు రచ్చ రచ్చ చేస్స్తారు.

ఇక వీకెండ్ లో వచ్చిన నాగార్జున మాత్రం ఎవరెవరు ఇలాంటి తప్పులు చేశారు అనేది ఐడెంటిఫై చేసి వాటికి సంబంధించిన వీడియోలను చూపిస్తూ వాళ్లని మందలిస్తూ ఉంటాడు. మరి ఇలాంటి క్రమంలో నాగార్జున బిగ్ బాస్ షో కి సంబంధించిన అన్ని ఎపిసోడ్స్ చూస్తాడా? ఆయన ప్రస్తుతం ఉన్న బిజీ కి బిగ్ బాస్ షో ని చూసే అంత ఖాళీ సమయం దొరుకుతుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి…

నిజానికి ఆయన ఆ షో మొత్తం చూడడు. ఇక మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నట్టుగానే ఈ షో మొత్తం స్క్రిప్ట్ బేస్డ్ గానే నడుస్తూ ఉంటుంది. కాబట్టి నాగార్జున ఏం మాట్లాడాలి ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు. దానికి కౌంటర్ గా నాగార్జున ఎలాంటి మాటలు మాట్లాడాలి. అనేది ముందుగా అతనికి రైటర్లు ఎక్స్ ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత పిసిఆర్ రూమ్ నుంచి నాగార్జున పెట్టుకున్న ఇన్ ఇయర్ ద్వారా రైటర్ నాగార్జునకి ఏం మాట్లాడాలి అనేది అప్డేట్ ఇస్తూ ఉంటాడు.

దానివల్ల నాగార్జున సిచ్యువేషన్ కి తగ్గట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. అలా ఈ షోలో మొత్తానికైతే రైటర్ తను రాసింది నాగార్జున నోటి నుంచి పలికిస్తాడు అంతే తప్ప నాగార్జున షో మొత్తాన్ని చూసి ఎవరు తప్పు చేశారు ఎవరు ఒప్పు చేశారు అని చూస్తూ కూర్చునేంత ఖాళీ సమయం అయితే ఆయనకు లేదు. ఇక ఆ షో డైరెక్టర్ నాగార్జునతో ఎవరి మీద ఎలా రెస్పాండ్ అవ్వాలి. ఎవరి మీద కోపానికి రావాలనేది కూడా ముందే చెప్తాడు…ఇక ప్రస్తుతం నాగార్జున అటు విలన్ గా, ఇటు హీరోగా పలు సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు…