https://oktelugu.com/

Mahindra Thar :  మహీంద్రా థార్ మొదటి వెర్షన్ వేలం.. ఎన్ని కోట్లో తెలుసా?

ఫస్ట్ రిలీజ్ అయిన థార్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఈ కారును నడిపిన చాలా మంది కొత్త అనుభూతిని పొందామని అంటున్నారు. అయితే థార్ గురించి ఇప్పుడో విశేషంగా చర్చించుకుంటున్నారు. ఈ కారును వేలం వేయడం ద్వారా కోటి రూపాయలకు పైగా వచ్చాయి. అసలు విషయం ఏంటంటే?

Written By:
  • Srinivas
  • , Updated On : September 24, 2024 / 10:54 AM IST

    Mahindra Thar

    Follow us on

    Mahindra Thar :  దేశీయ కార్ల కంపెనీ అయిన మహీంద్రా అండ్ మహీంద్రా గురించి కార్లు వాడే వారికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కంపెనీ కార్లు విపరీతంగా ఆకట్టుకుంటాయి. పూర్తిగా SUV వేరియంట్ లో మార్కెట్లోకి వచ్చిన ఈ కంపెనీ కార్లు దాదాపు అన్నీ సక్సెస్ అయ్యాయి. ముఖ్యంగా మహీంద్రా నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన ‘థార్’ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచింది. థార్ ఇప్పటి వరకు వివిధ వేరియంట్లలో మార్కెట్లోకి వచ్చింది. కానీ ఫస్ట్ రిలీజ్ అయిన థార్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఈ కారును నడిపిన చాలా మంది కొత్త అనుభూతిని పొందామని అంటున్నారు. అయితే థార్ గురించి ఇప్పుడో విశేషంగా చర్చించుకుంటున్నారు. ఈ కారును వేలం వేయడం ద్వారా కోటి రూపాయలకు పైగా వచ్చాయి. అసలు విషయం ఏంటంటే?

    దేశంలో చాలా మంది వినియోగదారులకు ఫేవరేట్ గా నిలిచిన మహీంద్రా కంపెనీ 2010లో థార్ ను రిలీజ్ చేసింది. ఎలాంటి ప్రదేశాల్లోనైనా రవాణా చేసే వీలుగా దీనిని తయారు చేశారు. అప్పట్లో రిలీజ్ చేసిన థార్ 2.5 లీటర్ టర్బో ఛార్జ్ డిజిల్ ఇంజిన్ తో ఉండేది. 105 హార్స్ పవర్ తో 247 ఎన్ ఎం టార్క్ ను రిలీజ్ చేసింది. కొత్తలో దీనిని పట్టించుకోకపోయినా ఆ తరువాత ఇది సక్సెస్ మోడల్ గా నిలిచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 2024 వరకు వచ్చిన వివిధ మోడళ్లు కలిపి థార్ మొత్తం 1,86,055 యూనిట్ల విక్రయాలు జరుపుకుంది. ఇంతటి ఆధరణ కలిగిన థార్ ను ఇటీవల వేలం వేశారు.

    మహీంద్రా నుంచి రిలీజ్ అయిన మొదటి థార్ ను ఇటీవల వేలం వేశారు. దీనిని వేలం వేయగా రూ.1.31 కోట్లతో అమ్ముడు పోయింది. VIN 0001ఛాసిస్ నంబర్ కలిగిన ఈ కారు AX7 L డీజిల్ 4×4 టాప్ వేరియంట్. ఈ కారుపై కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్రా సంతకం ఉండడం విశేషం. ఈ కారు ప్రస్తుతం మార్కెట్లో రూ.16 లక్షలతో విక్రయిస్తున్నారు. ఇటీవలే థార్ కు అప్డేట్ గా థార్ రాక్స్ ను రిలీజ్ చేశారు. ఈ తరుణంలో థార్ మొదటి వెర్షన్ ను వేలం వేయడం ద్వారా ఈ కారు మరింత ప్రత్యేకత సాధించింది.మహీంద్రా మొదటి థార్ ను వేలం వేయడం ద్వారా వచ్చిన డబ్బును సామాజిక కార్యక్రమాల కోసం ఉపయోగించనున్నారు.

    మహీంద్రా మొదటి థార్ తరువాత అనేక వెర్షన్లు మార్కెట్లోకి వచ్చాయి. దీని తరువాత ఎర్త్ ఎడిషన్, ఎర్త్ ఎడిషన్ డీజిల్AT, LXకన్వర్ట్ టాప్ AT, LX హార్డ్ టాప్ AT, AXఆప్ట్ హార్డ్ టాప్ డీజిల్ RXD, LX హార్డ్ టాప్ డీజిల్ RWD, LX హార్డ్ టాప్ తో సహా మొత్తం 19 వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. మహీంద్రా థార్ తరువాత ఎన్నో కార్లు దీనికి పోటీగా వచ్చాయి. ముఖ్యంగా మారుతి నుంచి జిమ్నిని మార్కెట్లోకి తీసుకొచ్చారు. కానీ థార్ కు ఉన్న వ్యాల్యూ తగ్గడం లేదు.