S V Ranga Rao: ఎన్టీఆర్-ఏఎన్నార్ సమకాలీన నటులు. కొంచెం అటూ ఇటూ ఒకే సమయంలో పరిశ్రమలో అడుగుపెట్టారు. చెప్పాలంటే అక్కనేని నాగేశ్వరరావు మొదట సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. ఎన్టీఆర్ పరిశ్రమకు వచ్చేనాటికి ఏఎన్నార్ కి కొంత గుర్తింపు కూడా ఉంది. అనంతరం ఇద్దరూ కలిసి చిత్రాలు చేశారు. నెంబర్ వన్, నెంబర్ 2 స్థానాలు వీరివే. బాక్సాఫీస్ లెక్కలను బట్టి సమీకరణాలు మారుతూ ఉండేవి.
తెలుగు సినిమాకు ఎన్టీఆర్-ఏఎన్నార్ రెండు కళ్ళు అనేవారు. అంతగా వీరి ప్రాభవం ఉండేది. ఎన్టీఆర్ పౌరాణిక, మాస్ కమర్షియల్ చిత్రాలతో మెప్పిస్తే… ఏఎన్నార్ క్లాస్ సబ్జెక్ట్స్ తో ప్రేక్షకులను అలరించారు. వీరిద్దరి కాంబోలో కొన్ని టాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్స్ ఉన్నాయి. మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మ కథ వంటి గొప్ప చిత్రాల్లో వీరు స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
ఎన్టీఆర్-ఏఎన్నార్ కలిసి ఏకంగా 15 చిత్రాలు చేశారు. ఇద్దరు టాప్ హీరోలు ఇన్ని చిత్రాల్లో కలిసి నటించడం అరుదైన రికార్డు. అలాగే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలుగా ఉన్నారు. పరిశ్రమపై డామినేషన్ వీరిదే. దర్శక నిర్మాతలు వారి డేట్స్ కోసం క్యూ కట్టేవారు. అలాంటి ఎన్టీఆర్, ఏఎన్నార్ లను ఓ నటుడు భయపెట్టాడట. ఆయనంటే వీరిద్దరూ వణికిపోయేవారట.
ఆ నటుడు ఎవరో కాదు ఎస్వీ రంగారావు. మహానటుడుగా పేరుగాంచిన ఎస్వీఆర్ అంటే ఎన్టీఆర్, ఏఎన్నార్ సైతం భయపడేవారట. ఈ విషయాన్ని వారి సమకాలీన నటుడు కైకాల సత్యనారాయణ ఓ సందర్భంలో స్వయంగా చెప్పాడు. కైకాల మాట్లాడుతూ… ఏఎన్నార్-ఎన్టీఆర్ మధ్య పాత్రల విషయంలో పోటీ ఉండేది. అయితే ఎస్వీర్ కి ఇద్దరూ భయపడేవారు. నాలాంటి వాళ్లకైతే ఆయన్ని చూస్తే మాట కూడా వచ్చేది కాదు.
ఎక్కడ డామినేట్ చేస్తాడో అని ఆందోళన ఉండేది. ఎస్వీఆర్ కూడా అనేవారు. హీరోలదేముందయ్యా… ఈజీగా కొట్టేస్తాను అని. ఆయన చాలా టాలెంటెడ్. ఆయనకు ఎవరూ సాటిరారు.. అని అన్నారు. ఏఎన్నార్, ఎన్టీఆర్, ఎస్వీఆర్ పలు చిత్రాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. మిస్సమ్మ, గుండమ్మ కథ, మాయాబజార్ మూవీలలో ఈ ముగ్గురు నటించారు. మాయాబజార్ మూవీకి ఎస్వీఆర్ ప్రత్యేక ఆకర్షణ. మాయాబజార్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఎస్వీఆర్.
తాగుడు వ్యసనానికి బానిసైన ఎస్వీఆర్ అనారోగ్యంతో కన్నుమూశారు. రోజంతా తాగుతూ ఉండే ఎస్వీఆర్.. షూటింగ్ కి మత్తులోనే వచ్చేవారట. ఒక్కోసారి షూటింగ్ కి రాకుండా తాగి ఇంట్లోనో, ఫార్మ్ హౌస్లోనో పడిపోయేవారట. తాగుడు వ్యసనం కారణంగా.. ఓ టాలెంటెడ్ యాక్టర్ జీవితం త్వరగా ముగిసింది.