Allu Arjun Wife Sneha Reddy: ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటారు. ఇది బాగా తెలిసిన అల్లు అరవింద్ కొడుకు అల్లు అర్జున్ కి రైట్ ఏజ్ లో పెళ్లి చేశారు. 25 ఏళ్ళు మించకుండా మూడు ముళ్ళు వేయించాడు. అల్లు అర్జున్-స్నేహారెడ్డిలది ప్రేమ వివాహం. లవ్ యట్ ఫస్ట్ సైట్ అన్నట్లు స్నేహారెడ్డి-అల్లు అర్జున్ మొదటి చూపులోనే ఒకరికొకరు పడిపోయారు. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన ఈ జంట పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. అల్లు అర్జున్ ప్రేమను తండ్రి అల్లు అరవింద్ వెంటనే ఓకే చేశారు. స్నేహారెడ్డి ఫాదర్ మాత్రం ససేమిరా అన్నారు. సినిమా వాళ్లతో సంబంధాలు కరెక్ట్ కాదని ఆయన సంకోచించారు.

అయితే స్నేహారెడ్డి పట్టుబట్టడంతో చేసేది లేక… పెళ్లికి ఒప్పుకున్నారు. 2011 మార్చ్ నెలలో అల్లు అర్జున్-స్నేహారెడ్డి వివాహం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. అయితే అల్లు అర్జున్ తల్లి నిర్మల కోడలికి ఓ కండీషన్ పెట్టిందట. కోడలిగా నా కోరిక తీర్చాలంటూ పట్టుబట్టారట. మోడరన్ లైఫ్ స్టైల్ కలిగిన స్నేహారెడ్డి అప్పుడే పిల్లల్ని కనడానికి ఇష్టపడదేమో అని నిర్మల భావించారట. ఆ భయంతో వీలైనంత త్వరగా బాబో, పాపనో కని చేతిలో పెట్టాలని గట్టిగా చెప్పారట. అప్పుడే పిల్లలు వద్దు, నాలుగేళ్లకు కంటాం ఐదేళ్లకు కంటామని కాలపరిమితులు పెట్టుకోవడానికి వీల్లేదన్నారట.
మరి అత్త కోరిక తూచా తప్పకుండా స్నేహారెడ్డి పాటించారు. 2014లో అబ్బాయి అల్లు అయాన్ ని 2016 లో అమ్మాయి అల్లు అర్హను కని నానమ్మ చేతిలో పెట్టింది. టాలీవుడ్ క్యూట్ ఫ్యామిలీస్ లో ఒకటిగా అల్లు అర్జున్ ఫ్యామిలీని చెప్పుకుంటారు. బన్నీ సైతం ఖాళీ దొరికితే చిన్న పిల్లాడిలా కొడుకు, కూతురుతో ఆడుకుంటాడు. ముఖ్యంగా అర్హ అంటే ఆయనకు పంచ ప్రాణాలు. కాగా అల్లు అర్హ శాకుంతలం మూవీతో వెండితెరకు పరిచయం కానున్నారు.

మరోవైపు అల్లు అర్జున్ పుష్ప 2 కి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. పుష్ప పార్ట్ 1 భారీ విజయం సాధించగా పార్ట్ 2 దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో నిర్మించనున్నట్లు సమాచారం. క్యాస్టింగ్ తో పాటు స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేశారట. పుష్ప మొదటి భాగం వరల్డ్ వైడ్ రూ. 360 కోట్ల గ్రాస్ రాబట్టిన విషయం తెలిసిందే. హిందీలో వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించిన పుష్ప అల్లు అర్జున్ కి పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిపెట్టింది.
[…] […]