Pawan Kalyan Lifestyle: పవన్ కళ్యాణ్ సింప్లిసిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. కోట్ల సంపాదన, ఆస్తులు ఉన్న పవన్ లగ్జరీ లైఫ్ అనుభవించవచ్చు. కానీ సదా సీదా జీవితం గడపడం ఆయనకు ఇష్టం. తినే ఆహారం నుండి పడుకునే బెడ్ వరకు ఓ సాధారణ వ్యక్తిగా జీవనం సాగిస్తాడు. దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోల్లో ఒకరిగా ఉన్న పవన్ కళ్యాణ్ విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడరు. ఆయన ప్రశాంత జీవనం కోరుకుంటారు.ఫార్మ్ హౌస్ లో వ్యవసాయం చేస్తారు. చాపపై పడుకుంటారు. ఋషులు జీవించినట్లు పవన్ కళ్యాణ్ జీవనం ఉంటుంది.

ఇక పవన్ కళ్యాణ్ కి అత్యంత ప్రీతిపాత్రమైన పని ఒకటి ఉందట. తన పిల్లలు, భార్య కంటే కూడా అది ఆయనకు చాలా ఇష్టమట. సాధారణంగా ఖాళీ సమయం దొరికితే మిగతా స్టార్స్ భార్యా పిల్లలతో గడపడానికి ఇష్టపడతారు. కుటుంబంతో పాటు విహారాలకు వెళుతూ ఉంటారు. కానీ పవన్ కి అవేమీ ఆనందం కలిగించవట. ఫార్మ్ హౌస్ లో గల మామిడి చెట్టు క్రింద కూర్చొని పుస్తకం చదువుకోవడం పవన్ కి అత్యంత ఇష్టమైన పని అట. విరామం దొరికితే ఆయన ఫార్మ్ హౌస్ కి వెళ్లి అదే పని చేస్తారట. ప్రశాంత వాతావరణంలో చదువుతూ మునిగిపోతారట.
పవన్ కళ్యాణ్ ని దగ్గరా చూసిన సన్నిహితులు ఈ విషయాలు వెల్లడించారు. హైదరాబాద్ నగర శివారులో పవన్ కళ్యాణ్ కి పది ఎకరాల ఫార్మ్ ల్యాండ్ ఉంది. ఇటీవల ఆయన అందులో ఉన్న పాత ఫార్మ్ హౌస్ ని కూల్చి కొత్త హౌస్ నిర్మాణం చేపట్టారు. ఆ మధ్య అనారోగ్యానికి గురైన పవన్ కళ్యాణ్ ఫార్మ్ హౌస్ లోనే గడిపారు. కొత్త ఫార్మ్ హౌస్ నిర్మాణ పనులు చూసుకున్నారు.

మరోవైపు రాజకీయంగా ఆయన బిజీగా ఉన్నారు. 2024 ఎన్నికలు లక్ష్యంగా పని చేస్తున్నారు. అక్టోబర్ నుండి పవన్ బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రకటన చేయడం జరిగింది. ఇక పవన్ బర్త్ డే కానుకగా హరి హర వీరమల్లు నుండి పవర్ గ్లాన్స్ విడుదల చేశారు. ఇది అభిమానులను ఆకట్టుకుంది. చిత్రీకరణ దశలో ఉన్న హరి హర వీరమల్లు షూటింగ్ త్వరలో తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కలవు. భవదీయుడు భగత్ ఇప్పటికే ఆగిపోగా, పవన్ కనీసం హరి హర వీరమల్లు పూర్తి చేయాలని కోరుకుంటున్నారు.
Also Read:Ponduru Khadi: ఆవుపేడతో పొందూరు ఖద్దరు… ఎన్టీఆర్ నుంచి వైఎస్ఆర్ వరకూ వాడిన దీని ప్రత్యేకత తెలుసా?
[…] Also Read: Pawan Kalyan Lifestyle: కన్న బిడ్డలు కోట్ల ఆస్థి లగ్… […]