Koratala Siva
Koratala Siva: ఒక్కసారి ఇండస్ట్రీలో హిట్ కొడితే అదే టాక్ ను రిపీట్ చేయడం కష్టమే. ఎన్ని హిట్లు కొట్టినా ఒక్క ఫ్లాప్ వచ్చిందంటే చాలు ఆ డైరెక్టర్ తో సినిమా చేయాలంటే భయపడుతుంటారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో కొరటాల శివ 80శాతం సక్సెస్ రేట్ సంపాదించాడు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్ లను సొంతం చేసుకున్నారు. దీంతో కొరటాల శివ రేంజ్ ఆకాశానికి అంటింది అనడంలో సందేహం లేదు. ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించారు కూడా.
ఆచార్య సినిమా ఫ్లాప్ కావడంతో ఒక్కసారిగా నెగిటివ్ టాక్ ను మూటగట్టుకున్నారు. ఈ సినిమా భారీ నష్టాలను మిగిల్చడంతో కొరటాల శివ ఇలాంటి సినిమా తీశాడేంటి అంటూ కామెంట్లు చేశారు. అంతే కాదు అదే సమయంలో శ్రీమంతుడు సినిమా కాపీరైట్ వివాదంతో కొరటాల శివ క్రిమినల్ కేసును ఫేస్ చేయాలంటూ వేర్వేరు కోర్టులు ఇచ్చిన తీర్పులు కూడా హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఈయన ఒక సినిమా కథను కాపీ కొట్టాడని ప్రచారం జరగడంతో ఆయన ఇతర సినిమాల కథలను కూడా కాపీ కొట్టారనే టాక్ వచ్చింది.
అయితే కొరటాల శివను ఇండస్ట్రీలో కొందరు విలన్ గా కూడా చూస్తున్నారట. ఇదిలా ఉంటే ఒకే ఆలోచన ఇద్దరు రచయితలకు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. యాదృచ్ఛికంగా ఇద్దరు ఒకే విధంగా ఆలోచించి ఒకేలాంటి సినిమాలు కూడా తీసే అవకాశాలు ఉంటాయి. తెలుగులో కూడా ఒక సినిమాను పోలిన సినిమాలో మరో సినిమాలు చాలానే ఉన్నాయి. అంతేకాదు అందులో హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. అయితే కొరటాల శివ చచ్చేంత ప్రేమ అనే కథను చదవలేదని ఈ ఆరోపణలు వచ్చిన సమయంలోనే వెల్లడించారు.
కానీ కొరటాల శివ తప్పు చేశారంటే కొందరు నమ్మడం లేదు. చచ్చేంత ప్రేమ కథకు శ్రీమంతుడు సినిమాకు పోలికలు ఉన్నా నూటికి నూరు శాతం పోలికలు లేవు అంటారు కొందరు. విల్సన్ చచ్చేంత ప్రేమ కథకు రచయిత కానీ శరత్ చంద్ర అనే కలం పేరుతో నవల రాశారు. మరి ఈ వివాదం ఎప్పుడు చల్లారుతుందో చూడాలి. తొందరగా కొరటాల శివ ఈ వివాదాన్ని పరిష్కరించుకుంటే బాగుంటుందని కొందరు సలహాలు ఇస్తున్నారు.