https://oktelugu.com/

Photo Story: పిచ్చోడిలా మారిపోయిన ఈ కుర్ర హీరో ఎవరో గుర్తుపట్టారా..? ఇతను బిగ్ బాస్ కంటెస్టెంట్ కూడా!

ఈమధ్య కాలంలోనే ఇలాంటి అద్భుతాలను మనం చూస్తూ ఉన్నాము. ఇదంతా పక్కన పెడితే పైన చూపించిన ఫొటోలో , పిచ్చోడి అవతారం లో కనిపించిన ఆ కుర్ర హీరో ఎవరో గుర్తుపట్టారా?, ఇతనికి తమిళనాట యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. అంతే కాదు ఇతను తమిళ బిగ్ బాస్ షో లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టి అశేషమైన ప్రేక్షకాదరణ సంపాదించాడు.

Written By:
  • Vicky
  • , Updated On : October 19, 2024 / 05:05 PM IST

    Photo story(6)

    Follow us on

    Photo Story: మారుతున్న ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా స్టార్ హీరోలు కూడా కొత్త తరహా పాత్రలను పోషిస్తూ సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుడుతున్నారు. ఇక కుర్ర హీరోలకు ఎలాంటి పరిమితులు లేవు కాబట్టి, విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ, ఆడియన్స్ నుండి విశేష ఆదరణ దక్కించుకొని బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకుంటున్నారు. ఈ ఏడాది చిన్న సినిమాలుగా విడుదలై భారీ బ్లాక్ బస్టర్స్ గా నిల్చిన ప్రతీ సినిమా ఇలాంటి కథలే అవ్వడం విశేషం. మేకర్స్ కూడా కొత్త ఆలోచనలకూ పదును పెడుతూ, సరికొత్త కాన్సెప్ట్స్ తో మన ముందుకు వస్తున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో మన సౌత్ మార్కెట్ పెరిగినందున, వినూతనమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకులను అలరిస్తే 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.

    ఈమధ్య కాలంలోనే ఇలాంటి అద్భుతాలను మనం చూస్తూ ఉన్నాము. ఇదంతా పక్కన పెడితే పైన చూపించిన ఫొటోలో , పిచ్చోడి అవతారం లో కనిపించిన ఆ కుర్ర హీరో ఎవరో గుర్తుపట్టారా?, ఇతనికి తమిళనాట యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. అంతే కాదు ఇతను తమిళ బిగ్ బాస్ షో లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టి అశేషమైన ప్రేక్షకాదరణ సంపాదించాడు. అలా బిగ్ బాస్ ద్వారా ఫేమ్ ని సంపాదించుకున్న ఈ నటుడికి ఈమధ్య అవకాశాలు క్యూలు కడుతున్నాయి. అతని పేరు కెవిన్. రీసెంట్ గానే ఈయన హీరోగా నటించిన ‘దాదా’ అనే చిత్రం తమిళ నాట పెద్ద సూపర్ హిట్ గా నిల్చింది. తెలుగు లో కూడా ఈ చిత్రాన్ని దబ్ చేసి విడుదల చేసారు కానీ, అనుకున్న స్థాయి రెస్పాన్స్ మాత్రం రాలేదు. అయితే కెవిన్ లోని అద్భుతమైన యాక్టింగ్ టాలెంట్ ని గమనించిన ప్రముఖ తమిళ టాప్ డైరెక్టర్ నెల్సన్, ఇతన్ని హీరో గా పెట్టి నిర్మాతగా ‘బ్లడీ బెగ్గర్’ అనే చిత్రం చేసాడు. ఆ సినిమాకి సంబంధించిన లుక్ ఇప్పుడు మీరు పైన చూస్తున్నది. ఈ చిత్రంలో కెవిన్ బిచ్చగాడిగా నటిస్తున్నాడు. అక్టోబర్ 31 వ తేదీన దీపావళి సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

    దీనికి సంబంధించిన ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు ఈ హీరో. నెల్సన్ లాంటి దర్శకుడు నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న సినిమా కాబట్టి, కచ్చితంగా ఈ చిత్రంలో విషయం ఉంటుంది అనే అనుకుంటున్నారు ఆడియన్స్. అంతేకాకుండా గత ఏడాది ఈయన దాదా చిత్రం తో భారీ హిట్ అందుకోవడంతో ఈయన సినిమాలపై జనాల్లో ఆసక్తి ఏర్పడింది. 2012 వ సంవత్సరం నుండి క్యారక్టర్ ఆర్టిస్టుగా తమిళ సినిమాల్లో నటిస్తూ వచ్చిన ఈయన, బిగ్ బాస్ తర్వాత క్రేజీ హీరో గా అవతరించాడు. ప్రస్తుతం ఇతని చేతిలో ‘బ్లడీ బెగ్గర్’ తో పాటు మరో నాలుగు సినిమాలు ఉన్నాయి.