HomeతెలంగాణGroup1 Candidates: సుప్రీం కోర్టుకు గ్రూప్‌–1 అభ్యర్థులు.. ఆ జీవో రద్దు చేయాలని పిటిషన్‌.. ఎందుకంత...

Group1 Candidates: సుప్రీం కోర్టుకు గ్రూప్‌–1 అభ్యర్థులు.. ఆ జీవో రద్దు చేయాలని పిటిషన్‌.. ఎందుకంత పట్టు!?

Group1 Candidates: తెలంగాణ ప్రభుత్వం జీవో 55ను సవరిస్తూ జారీ చేసిన జీవో 29 గ్రూప్‌–1 అభ్యర్థుల ఆందోళనకు కారణమైంది. ఇప్పటికే ప్రిలిమ్స్‌ పూర్తి కావడంతో క్వాలిఫై అయిన అభ్యర్థులు మెయిన్స్‌కు సన్నద్ధమయ్యారు. అయితే గత ఫిబ్రవరిలో ప్రభుత్వం జీవో 29ని జారీ చేసింది. ఇన్నాళ్లు జీవోపై మాట్లాడని అభ్యర్థులు పరీక్ష సమీపించిన వేళ ఆందోళనకు దిగారు. ఏడు నెలలు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు. అక్టోబర్‌ 21 పరీక్షల ప్రారంభం కానున్న వేళ వారం ముందు ఆందోళన చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జీవో 29 రద్దు చేయాలని గ్రూప్‌–1 పరీక్షలు వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టు సింగ్, డివిజన్‌ బెంచ్‌లను ఆశ్రయించారు అభ్యర్థులు. రెండు పిటిషన్లను కోర్టు కొట్టేసింది. దీంతో అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. మరోవైపు సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించారు. జీవో 29 ని రద్దు చేయాలని జీవో 55నే కొనసాగించాలని సుప్రీంలో పిటిషన్‌ వేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం.. విచారణ సోమవారం జరుపుతామని తెలిపింది. అయితే సోమవారం నుంచే పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఆందోళన బాటపట్టారు.

రాజకీయరంగు..
ఇదిలా ఉంటే గ్రూప్‌–1 అభ్యర్థుల ఆందోళన రాజకీయరంగు పులుముకుంది. త్వరలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నిల్లో పట్టభద్రులు కీలకం కానున్నారు. దీంతో విపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలో గ్రూప్‌–1 అభ్యర్థుల ఆందోళనను ఓన్‌ చేసుకునేప్రయత్నం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రెండు రోజుల క్రితం గ్రూప్‌–1 అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఇక బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కూడా గ్రూప్‌ – 1 అభ్యర్థులకు సంఘీభావం తెలిపారు. వారికి మద్దతుగా జీవో 29 రద్దు చేయాలనే డిమాండ్‌లో అశోక్‌ నగర్‌ నుంచి సెక్రటేరియేట్‌ వరకు ర్యాలీ చేపట్టారు.

జీవో 29తో ఎవరికి నష్టం…
ఇదిలా ఉంటే జీవో 29 రద్దుకు గ్రూప్‌–1 అభ్యర్థులు పట్టుపట్టడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. 2022లో అప్పటి ప్రభుత్వం దివ్యాంగుల రిజర్వేషన్ల విషయంలో జీవో 55 జారీ చేసింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ జీవోను సవరిస్తూ జీవో 29 ను గత ఫిబ్రవరిలో జారీ చేసింది. అయితే ఈ జీవో కారణంగా అగ్రవర్ణ పేదలకు లబ్ధి కలుగుతుందని, అదరికీ సమానంగా రిజర్వేషన్‌ ఫలాలు అందవని అభ్యర్థులు పేర్కొంటున్నారు. దివ్యాంగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వారిని అన్‌రిజర్వుడుగా పరిగణిస్తే దివ్యాంగులకు అన్యాయం జరుగుతుందని పేర్కొంటున్నారు. మార్కులు ఎక్కువ వచ్చినా రిజర్వేషన్‌ కేటగిరీగానే పరిగణించి 1:50 నిష్పత్రిలో మెయిన్స్‌కు పిలవాలని కోరుతున్నారు.

ఏడు నెలలుగా మౌనం..
ఇదిలా ఉంటే.. ప్రభుత్వం జీవో 29ని ఫిబ్రవరి 8 జారీ చేసింది. అప్పటి నుంచి దీనిపై ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. కానీ, పరీక్షల షెడ్యూల్‌ ప్రారంభానికి వారం ముందు ఆందోళన చేయడం ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీసింది. ఆందోళనకారుల్లో నిజమైన అభ్యర్థులు ఎంతమంది ఉన్నారన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ వివాదం నేపథ్యంలో పరీక్షలను నిలిపివేయాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version