Tulasi Child Artist: కుటుంబ కథ చిత్రాలు తియ్యడం మాత్రమే కాదు, మాస్ సినిమాలు చేయడంలో కూడా విక్టరీ వెంకటేష్ రూటే సెపరేట్. ఆయన చేసిన మాస్ సినిమాలు ఇండస్ట్రీ ని షేక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వాటిల్లో మనం ‘తులసి’ చిత్రం గురించి కచ్చితంగా మాట్లాడుకోవాలి. ‘భద్ర’ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్న బోయపాటి శ్రీను రెండవ చిత్రమిది. ఇందులోని యాక్షన్ సన్నివేశాలు ఇప్పుడు చూసినా గూస్ బంప్స్ వస్తుంటాయి. విక్టరీ వెంకటేష్ ని ఇందులో చాలా పవర్ ఫుల్ గా చూపిస్తాడు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఉండే హీరో అంటే హీరోయిన్ నయనతారకు నచ్చదు. గొడవలకు దూరంగా ఉండే మనస్తత్వం ఆమెది. హీరో వెంకటేష్ ని విదేశాల్లో కలిసి, అక్కడ ఏర్పడిన కొన్ని సంఘటనల కారణంగా అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి చేసుకొని వెంకటేష్ తో పాటు సీమలో అడుగుపెట్టిన నయనతార, అక్కడ జరిగే గొడవలు చూసి వెంకటేష్ ని వదిలేస్తుంది.
తనతో పాటు కొడుకుని కూడా తీసుకెళ్లిపోతుంది. అయితే అనుకోకుండా వెంకటేష్ ఉండే అపార్ట్మెంట్స్ లోకి నయనతార తన కొడుకుతో కలిసి వస్తుంది. ఇక ఆ తర్వాత జరిగే స్టోరీ మొత్తం మన అందరికీ తెలిసిందే. ఇందులో వెంకటేష్ కొడుకుగా నటించిన బాల నటుడు చరిత్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఈ సినిమాలో ఈ బుడ్డోడి నటన చూడముచ్చటగా ఉంటుంది. ముద్దు ముద్దు మాటలతో చాలా ఫన్నీ గా అతడు మాట్లాడుతాడు. ఈ సినిమా తర్వాత ఆ బుడ్డోడు అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. ముఖ్యంగా జగపతి బాబు హీరో గా నటించిన ‘మా నాన్న చిరంజీవి’ చిత్రం లో ఆయన కొడుకుగా నటించి మంచి మార్కులు కొట్టేసాడు. అలాగే ఆయన స్వామి మణికంఠ తెరకెక్కించిన చిత్రంలో కూడా నటించాడు. ఇవి కాకుండా రవిబాబు దర్శకత్వం లో అల్లరి నరేష్ హీరో గా నటించిన ‘లడ్డుబాబు’ చిత్రంలో కూడా ఈ కుర్రాడు కీలక పాత్ర పోషించాడు. అయితే అతులిత్ లాగానే అనేక మంది బాలనటులు పెద్దయ్యాక హీరోలు గా స్థిరపడి ఇండస్ట్రీ లో ఉన్నత స్థాయిలో కొనసాగుతున్నారు.
ఉదాహరణకు తేజ సజ్జ ని తీసుకోవాలి, చిన్నప్పుడు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈయన పెద్దయ్యాక ‘ఓ బేబీ’ చిత్రం తో రీ ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత హనుమాన్ సినిమాతో పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి ఒక మంచి స్థాయిలో స్థిరపడ్డాడు. ఇప్పుడు అతులిత్ కూడా అలాగే ఎంట్రీ ఇస్తాడా లేదా అనేది పక్కన పెడితే, ఇతను 2018 వ సంవత్సరం లో ఘంటసాల బయోపిక్ లో నటించాడు. ఇందులో ఘంటసాల పాత్రని ప్రముఖ సింగర్ కృష్ణ చైతన్య పోషించగా, అతులిత్ ఘంటసాల యవ్వనంలో ఉన్నప్పటి పాత్రను పోషించాడు. ఈ సినిమా తర్వాత అతులిత్ మళ్ళీ సినిమాల్లో కొనసాగుతాడని అందరూ అనుకున్నారు కానీ, ఆలా జరగలేదు. ఇప్పుడు అతను విదేశాల్లో ఉద్యోగం చేసుకుంటూ స్థిరపడినట్టు తెలుస్తుంది.