https://oktelugu.com/

Lottery: తుక్కు అమ్ముకునే పెద్దాయనకు ఇన్నాళ్లకు జాక్‌పాట్‌.. రూ.500 లాటరీతో రూ.2.5 కోట్లు గెలిచాడు!

సంకల్పం గట్టిగా ఉండి.. దాని కోసం నిజాయతీగా శ్రమిస్తే.. అదృష్టం కలిసి రాగానే విజయం మన సొంతం అవుతుంది. ఇది అన్ని విషయాలకు వరిస్తుంది. ఎంత కష్టపడినా కాస్త లక్కు లేకుంటే లక్ష్యం నెరవేరదు. గెలుపు వరించదు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 10, 2024 / 03:41 PM IST

    Lottery

    Follow us on

    Lottery: మనం ఒక లక్ష్యం నిర్దేశించుకుని దానికి కోసం ఎంత శ్రమంచినా ఒక్కోసారి చేరుకోలేకపోతాం. కొందరు ఎలాంటి కష్టం లేకుండానే లక్ష్యం చేరుకుంటారు. ఇంకొందరు కాస్త కష్టపడి లక్ష్యాన్ని చేరుకుంటారు.‡అప్పుడు అనిపిస్తుంది మనకు అదృష్టం లేదని. ఇది నూటిని నూరుపాళ్లు నిజమే. ఏ విషయంలో అయినా.. మన కష్టానికి కాస్త అదృష్టం కూడా తోడవ్వాలి. అప్పుడే విజయం వరిస్తుంది. లేదంటే మన సంకల్పం గొప్పదే అయినా.. మన శ్రమలో ఎలాంటి లోపం లేకపోయినా.. మనం పడే కష్టమంతా వృథానే అవుతుంది. ఇప్పుడు ఇదే జరిగింది పంజాబ్‌కు చెందిన ఓ స్క్రాప్‌ డీలర్‌ విషయంలో. లాటరీ టికెట్లు కొనడం ఎప్పటి నుంచో అలవాటు చేసుకున్నాడు. ఎన్నటికైనా అదృష్టం వరించకపోతుందా అన్న ఆశతో ఎన్నిసార్లు నిరాశ కలిగినా టికెట్లు కొనడం మానలేదు. చివరకు అతని సంకల్పానికి అదృష్టం తోడైంది. రూ.500లతో కొన్న లాటరీ టికెట్‌.. అతడిని కోటీశ్వరుడిని చేసింది. రాఖీ సందర్భంగా కొన్న లాటరీ టికెట్‌ ద్వారా ఏకంగా రూ. 2.5 కోట్లు గెలుచుకున్నాడు.

    జలంధర్‌ వాసికి జాక్‌పాట్‌..
    జలంధర్‌ జిల్లాలోని ఆదమ్‌పూ#ర్‌కు చెందిన ప్రీతమ్‌ లాల్‌ జగ్గీ(67) స్క్రాప్‌ డీలర్‌గా పని చేసుకుంటూ జీవిస్తున్నారు. 50 ఏళ్లుగా ఆయనకు లాటరీ టికెట్‌ కొనే అలవాటు ఉంది. రాఖీ సందర్భంగా రూ.500తో ఓ లాటరీ టికెట్‌ను తన భార్య అనీతా జగ్గీ పేరు మీద కొన్నాడు. ఈసారి అదృష్టం ఆయన తలుపు తట్టింది. ఏకంగా రూ.2.5 కోట్లు గెలుచుకున్నాడు. అయితే ముందుగా తన లాటరీ 452749 నంబర్‌ను న్యూస్‌ పేపర్‌లో చూసి నమ్మలేదని, లాటరీ ఏజెంట్‌ ఫోన్‌ చేస్తే నమ్మకం కలిగిందని జగ్గీ చెబుతున్నారు.

    అదృష్టం వరించింది..
    ఈ సందర్భంగా ప్రీతమ్‌ లాల్‌ జగ్గీ మాట్లాడుతూ తాను గత 50 ఏళ్లుగా లాటరీ టికెట్లు కొంటున్నా అని తెలిపాడు. కొన్ని సార్లు చిన్న బహుమతులు వచ్చాయని పేర్కొన్నాడు. కానీ, ఈ రాఖీ రోజున లాటరీ టికెట్‌ కొంటాను అంటే తన భార్య ఇదే చివరిసారి అని చెప్పిందని తెలిపాడు. సేవక్‌ అనే వ్యక్తి దగ్గర నుంచి లాటరీ టికెట్‌ను ఈ సారి తన భార్య పేరిటే కొన్నానన్నాడు. అయితే ఆదివారం తన లాటరీ నంబర్‌ను న్యూస్‌ పేపర్‌లో చూశానని తెలిపాడు. కానీ నమ్మకం కలగకపోవడంతో ఏజెంట్‌ ఫోన్‌ చేశాక నమ్మకం వచ్చిందని పేర్కొన్నాడు. ఆ వార్త విని షాక్‌ అయ్యానని తెలిపాడు. ఒకప్పుడు రూపాయికి లాటరీ కొన్నా. చివరికి రూ.500 లాటరీ నన్ను కోటీశ్వరుడిని చేసిందని వెల్లడించాడు. ప్రస్తుతం తనకు సొంత ఇల్లు కూడా లేదని, వచ్చిన డబ్బుతో ఇల్లు, షాప్‌ ఏర్పాటు చేసుకుంటా అని ప్రీతమ్‌ లాల్‌ జగ్గీ వెల్లడించాడు.