https://oktelugu.com/

Guess Actress: టాప్ స్టార్స్ తో నటించిన ఈ స్టార్ హీరోయిన్ ని గుర్తుపట్టారా? ఇలా మారిపోయిందేంటి?

అప్పట్లో ఈ మూవీ ట్రెండ్ సెట్టర్. పెళ్లి సందడి మూవీలో సాంగ్స్ ఏళ్ల పాటు జనాల నోళ్ళలో నానాయి. కీరవాణి మ్యూజిక్ అందించారు. పెళ్లి సందడి సక్సెస్ తో రవళి టాలీవుడ్ లో బిజీ అయిపొయింది.

Written By:
  • NARESH
  • , Updated On : November 26, 2023 / 12:37 PM IST

    Guess Actress

    Follow us on

    Guess Actress: 90లలో స్టార్ హీరోయిన్ గా వెలిగింది రవళి. ఈమె మొదటి సినిమా జడ్జిమెంట్. 1990లో ఈ మలయాళ చిత్రం విడుదలైంది. ఆ నెక్స్ట్ ఇయర్ జయభేరి మూవీతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. రవళికి 1996లో బ్రేక్ వచ్చింది. శ్రీకాంత్ కి జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ వినోదం మంచి విజయం సాధించింది. అదే ఏడాది పెళ్లి సందడి చిత్రంలో నటించింది. శ్రీకాంత్ తో మరోసారి జతకట్టింది. కే రాఘవేంద్రరావు తెరకెక్కించిన పెళ్లి సందడి ఇండస్ట్రీ హిట్ కొట్టింది.

    అప్పట్లో ఈ మూవీ ట్రెండ్ సెట్టర్. పెళ్లి సందడి మూవీలో సాంగ్స్ ఏళ్ల పాటు జనాల నోళ్ళలో నానాయి. కీరవాణి మ్యూజిక్ అందించారు. పెళ్లి సందడి సక్సెస్ తో రవళి టాలీవుడ్ లో బిజీ అయిపొయింది. నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో ఆమెకు అవకాశాలు వచ్చాయి. బాలయ్యతో ముద్దుల మొగుడు, నాగార్జునతో రాముడొచ్చాడు, వెంకటేష్ కి జంటగా చిన్నబ్బాయి చిత్రాల్లో నటించింది.

    2006 వరకు రవళి నటిస్తూ వచ్చారు. స్టాలిన్ మూవీలో రవళి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయడం విశేషం. 2007లో రవళి వివాహం చేసుకుంది. రవళి భర్త పేరు నీలి కృష్ణ. వివాహం అనంతరం నటనకు దూరమైంది. ఒకటి రెండు చిత్రాలు చేసినా అవి సరిగా ఆడలేదు. రవళికి ఇద్దరు అమ్మాయిలు. రవళి చివరిగా మాయగాడు అనే మూవీలో నటించింది. ఈ చిత్రం 2011లో విడుదలైంది.

    యాక్టింగ్ మానేసిన రవళి శరీరం మీద శ్రద్ద వదిలేశారు. రవళి లేటెస్ట్ లుక్ చూసి జనాలు షాక్ అయ్యారు. ఆమె గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. విపరీతంగా బరువు పెరిగిన రవళి ఒకప్పటి అందం కోల్పోయారు. తిరుమల శ్రీవారి దర్శనానికి ఆమె కుటుంబ సభ్యులతో పాటు వచ్చారు. అప్పుడు మీడియా ఆమె ఫోటోలను క్లిక్ చేశారు. రవళి లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది.