Star Heroine: పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా? రెండేళ్ల క్రితం వరకు ఇండస్ట్రీని షేక్ చేసిన స్టార్ హీరోయిన్. పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఐరెన్ లెగ్ గా ముద్రవేసుకున్న ఈ బ్యూటీ… ఆ తర్వాత వరుస హిట్లు అందుకుని లక్కీ హీరోయిన్ ట్యాగ్ సొంతం చేసుకుంది. తెలుగులో స్టార్ హీరోలందరితో అమ్మడు జతకట్టింది. ఇప్పటికే ఆమె ఎవరో అర్థమయ్యే ఉంటుంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు. టాలీవుడ్ బుట్టబొమ్మ గా పేరు తెచ్చుకున్న పూజ హెగ్డే(Pooja Hegde).
అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) హీరోగా తెరకెక్కిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది. ఈ చిత్రం ఆశించినంతగా ఆడకపోయినా.. పూజా హెగ్డే నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. ఇక అల్లు అర్జున్(Allu Arjun) కి జంటగా నటించిన డీజే మూవీతో పూజా కెరీర్ టర్న్ అయింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్ హీరోలతో జత కట్టింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తన ఖాతాలో వేసుకుంది.
Also Read: Megastar Chiranjeevi: చిరంజీవికి అరుదైన గౌరవం.. కానీ బన్నీ తర్వాతే..
స్టార్ హీరోయిన్ హోదా లో ఓ వెలుగు వెలిగింది. అయితే బొట్టబొమ్మకి గత కొంతకాలంగా బ్యాడ్ టైం నడుస్తుంది. వరుస పరాజయాలతో రేస్ లో వెనుక పడింది. ఆచార్య, రాధేశ్యామ్, బీస్ట్… ఇలా డిజాస్టర్లతో హ్యాట్రిక్ కొట్టింది. దీంతో మేకర్స్ పూజ హెగ్డే ని పక్కన పెట్టేసారు. సినిమా ఆఫర్లు లేకపోవడంతో సోషల్ మీడియాలో గ్లామర్ ఒలకబోస్తూ రచ్చ చేస్తుంది. పూజా ఫార్మ్ లో లేనప్పటికీ ఆమె ఫోటోలు బాగానే ట్రెండ్ అవుతాయి.
Also Read: Pushpa Team: కెజిఎఫ్ ఫార్మాట్ ఫాలో అవుతున్న పుష్ప టీమ్… పార్ట్ 3 ఉంది కానీ!
కాగా చూపు తిప్పుకోలేని అందం పూజా సొంతం. అందుకే ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలకు లక్షల్లో లైకులు, షేర్స్ వస్తుంటాయి. అయితే ఇప్పుడిప్పుడే పూజా హెగ్డేకు ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న దేవా సినిమాలో నటిస్తుంది. ఇక తెలుగులో సూర్య, కార్తీక్ సుబ్బరాజు కాంబోలో వస్తున్న మూవీ కోసం పూజ పేరు పరిశీలిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ ఓ మూవీకి సైన్ చేసినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.