Sujeeth: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గురించి మనం ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. ఎందుకంటే ఆయన ఒక శిఖరం లాంటివారు. ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలను బీట్ చేసి మరీ ఆయన టాప్ పొజిషన్ లోకి వెళ్ళాడు. ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అయినా వరుసగా సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.
ఒకపక్క రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ మరో పక్క సినిమాలను మాత్రం వదలకుండా చేస్తూ వస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన ఓజీ సినిమా(OG Movie) చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకి దర్శకుడుగా సుజీత్ వ్యవహరిస్తున్నాడు. అయితే మొదట సుజీత్ ని ఒక రీమేక్ సినిమా కోసం పవన్ కళ్యాణ్ పిలిపించారట. అయితే రీమేక్ సినిమా గురించి చెప్పడాని కంటే ముందే పవన్ కళ్యాణ్ మీ దగ్గర ఏదైనా స్టోరీ ఉంటే చెప్పండి అని సుజీత్ ని అడిగాడట..ఇక అప్పుడు పవన్ కళ్యాణ్ కి సుజీత్ ఒక కథ చెప్పి పవన్ కళ్యాణ్ ను ఒప్పించి సినిమాను సెట్స్ మీదకు తీసుకొచ్చాడు. లేకపోతే సుజీత్ కూడా ఏదో ఒక రీమేక్ సినిమా చేయాల్సి వచ్చేది.
Also Read: OG Movie: ఓజీ టైటిల్ వెనక ఉన్న కథ ఏంటంటే..?
ఇక ఇంతకు ముందు ప్రభాస్(Prabhas) తో చేసిన సాహో సినిమా ఆశించిన మేరకు విజయం సాధించలేదు. కాబట్టి తను కొంత గ్యాప్ తీసుకొని మరి పవన్ కళ్యాణ్ తో ఈ సినిమా చేస్తున్నాడు. ఇక ఇప్పుడు తను చేస్తున్న ఓజీ సినిమాతోనే భారీ సక్సెస్ కొట్టబోతున్నట్లు గా కూడా కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక మొత్తానికైతే ఈ సినిమా భారీ సక్సెస్ ని అందుకుంటుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.
ఇక పవన్ కళ్యాణ్ అభిమానిగా సుజీత్ ఓజీ సినిమాతో ఒక భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను తనకు అందిస్తాడని పవన్ కళ్యాణ్ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది…