Homeఎంటర్టైన్మెంట్Dasavathaaram Heroine: ‘దశావతారం’లోని ఈ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో గుర్తుపట్టారా?

Dasavathaaram Heroine: ‘దశావతారం’లోని ఈ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో గుర్తుపట్టారా?

ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్లలో మల్లికా షెరావత్ ఒకరు. ‘మర్డర్’ అనే సినిమాలో హద్దులు లేకుండా రొమాన్స్ చేసిన ఈమె ఆ తరువాత సినిమాల్లోనూ గ్లామర్ షో చేసింది. సినిమాల్లో నటిగానే కాకుండా ఐటమ్ సాంగ్స్ తో అలరించింది.

Dasavathaaram Heroine: కొన్నేళ్ల కిందట సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా కొనసాగిన చాలా మంది హీరోయిన్లు ఇప్పుడు కనిపించకుండా పోయారు. టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా నటించిన వారిలో కొందరు పెళ్లిళ్లు చేసుకొని సెటిలై పోగా..మరికొందరు విదేశాల్లోకి వెళ్లి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. తక్కువ సినిమాల్లోనే నటించి పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న ఓ హీరోయిన్ ఇప్పుడు విదేశాల్లో ఉంటోంది. ఆమెకు సంబంధించిన లేటేస్ట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అప్పటికీ, ఇప్పటికీ చెక్కు చెదరని అందంతో ఉన్న ఆమెను చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకోవాలని ఉందా..

ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్లలో మల్లికా షెరావత్ ఒకరు. ‘మర్డర్’ అనే సినిమాలో హద్దులు లేకుండా రొమాన్స్ చేసిన ఈమె ఆ తరువాత సినిమాల్లోనూ గ్లామర్ షో చేసింది. సినిమాల్లో నటిగానే కాకుండా ఐటమ్ సాంగ్స్ తో అలరించింది. మార్షల్ ఆర్ట్స్ హీరో జాకీచాన్ తో కలిసి నటించిన ఏకైక హీరోయిన్ మల్లికా షెరావత్ సౌత్ హీరో కమలాసన్ తో కలిసి పనిచేసింది. ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా అన్ని పాన్ ఇండియా లెవల్లో దూసుకు పోయినవే. ఇంతకీ ఈమె ప్రస్తుతం ఎలా ఉందో తెలుసా.

మల్లికా షెరావత్ హర్యానాలోని చిన్న గ్రామంలో జన్మించింది. ఆమెకు సినిమాల్లో నటించాలన్న కోరిక ఉండేది. ఇంట్లోవాళ్లు ఒప్పుకోకపోవడంతో పారిపోయి వచ్చి బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ‘మర్టర్’ అనే సినిమాతో ఫేమస్ అయినా ఈమె ఆ తరువాత పలు బాలీవుడ్ సినిమాల్లో నటించింది. మల్లికా చేసిన సినిమాలు తక్కువే. కానీ ఆమె నటించిన ప్రతీ మూవీ సెన్సెసన్ కావడంతో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. సౌత్ స్టార్ కమలాసన్ తో కలిసి ‘దశావతారం’లోల మల్లికా ఫైర్ బ్రాండ్ ను చూడొచ్చు.

ప్రస్తుతం మల్లికా అమెరికాలో ఉంటోంది. అయితే ఆమె అప్పటి నుంచి వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నట్లు తెలుస్తోంది. లేటేస్టుగా ఆమె వర్కౌట్ చేస్తున్న ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో మల్లికా షెరావత్ కుర్ర హీరోయిన్ లా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. అప్పటికీ, ఇప్పటికీ చెక్కు చెదరని అందంతో అలరిస్తోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక మల్లికా చివరిసారిగా 2019లో బూ సబ్కీ ఫటేగి అనే హరర్ వెబ్ సిరీస్ లో నటించింది. లేటేస్టుగా మరో మూవీ కోసం రెడీ అవుతున్నట్లు సమాచారం.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper