https://oktelugu.com/

Serial Actors: పెళ్లి కాకుండా సహజీవనం చేస్తున్న సీరియల్ నటీనటులు వీళ్లే..

ప్రియాంక జైన్- శివ్ కుమార్: బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయింది అందాల ముద్దుగుమ్మ ప్రియాంక జైన్. జానకి కలగనలేదు సీరియల్‌తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు సీరియల్ యాక్టర్ శివ కుమార్‌తో డేటింగ్‌ చేస్తుందని టాక్.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : August 8, 2024 / 04:56 PM IST

    Serial Actors

    Follow us on

    Serial Actors: బుల్లితెర మీద కూడా చాలా మంది బ్యూటీలు ఉన్నారు. సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.కేవలం తెలుగు అమ్మాయిలు మాత్రమే కాదు తెలుగు సీరియళ్లలో ఇతర భాషా ముద్దుగుమ్మలు కూడా క్రేజ్ ను సొంతం చేసుకుంటున్నారు. అయితే కొందరు పెళ్లి కాకుండానే సహజీవనం చేస్తుంటారు. అందులో సీరియల్ నటీనటులు కూడా ఉన్నారట. మరి ఆ లిస్ట్ లో ఉన్నది ఎవరో ఓ సారి తెలుసుకుందాం. వీరు ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా కో స్టార్స్‌తో సహజీవనం చేస్తున్నారు.

    ప్రియాంక జైన్- శివ్ కుమార్: బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయింది అందాల ముద్దుగుమ్మ ప్రియాంక జైన్. జానకి కలగనలేదు సీరియల్‌తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు సీరియల్ యాక్టర్ శివ కుమార్‌తో డేటింగ్‌ చేస్తుందని టాక్. మౌనరాగం సీరియల్‌తో స్నేహితులుగా మారి ఆ తర్వాత ప్రేమలో పడ్డారట. పెళ్లి చేసుకుంటామని చెబుతూనే పెళ్లిని మాత్రం దాటవేస్తున్నారు.

    కీర్తి భట్-కార్తీక్ తోట: కార్తీకదీపం సీరియల్‌తో తెలుగు వారికి బాగా పరిచయం అయింది కీర్తి భట్. కార్తీక దీపం సీరియల్ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 లోకి ఎంట్రీ ఇచ్చింది అమ్మడు. కార్తీక్ తోట అనే వ్యక్తితో ఇటీవలే ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. అయితే ఈ అమ్మడు కూడా పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తుందని టాక్.

    శోభా శెట్టి-యశ్వంత్: కార్తీకదీపం సీరియల్ ఫ్యాన్స్ కు మోనిత గురించి పరిచయం అవసరం లేదు. ఈ సీరియల్‌లో మోనిత విలన్ క్యారెక్టర్ లో చింపేసింది అని చెప్పవచ్చు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో కూడా ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించింది. తన ప్రియుడు యశ్వంత్‌తో శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ రీసెంట్ గా చేసుకుంది. కానీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. అయితే కొత్త ఇల్లు తీసుకొని అందులో ఇద్దరు సహజీవనం చేస్తున్నట్టు కూడా టాక్.

    సిరి హన్మంతు-శ్రీహాన్: పలు యూట్యూబ్ వెబ్ సిరీసులతో పాపులర్ అయింది ఈ జంట. సిరి సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్‌లో నటించింది. బిగ్ బాస్ తెలుగు 6 రన్నరప్ అయిన శ్రీహాన్‌తో సిరి చాలా కాలం నుంచి ప్రేమలో ఉందట. వీరిద్దరు పెళ్లి చేసుకోకుండా కలిసి ఉంటూనే ఓ బాబును కూడా దత్తత తీసుకున్నారు. ఇక ఈ లవ్ బర్డ్స్ గురించి ప్రత్యేకంగా ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. యూట్యూబ్ వీడియోలు, కవర్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ తో వీళ్లిద్దరు చాలా సందడి చేశారు. ఆన్ స్క్రీన్‌పై ఎంతో అందంగా కనిపించే ఈ జంట నిజ జీవితంలో కూడా ప్రేమలో ఉండటంతో మరింత అట్రాక్ట్ అయ్యారు నెటిజన్లు. బిగ్ బాస్ షోలో సిరి హన్మంతు కాస్త ఓవర్ యాక్షన్ చేసినట్లు. షణ్ముఖ్ జస్వంత్ తో లిమిట్స్ దాటి ప్రవర్తించిడంతో శ్రీహాన్ తో ఇక రిలేషన్ కట్ అనుకున్నారు.కానీ అదేమీ జరగలేదు. పైగా వీరి ప్రేమ బంధం మరింత బలపడింది. దీంతో అభిమానులు సంతోషించారు.

    సిద్ధు పవన్-సోనియా సింగ్: యూట్యూబ్ వెబ్ సిరీసులు, టీవీ షోలలో వైరల్ కామెంట్స్‌తో చాలా ఎక్కువ పాపులర్ అయింది సోనియా. విరూపాక్ష సినిమాలో కీ రోల్ లో నటించింది. సోనియా సింగ్, సిద్ధూ పవన్ యూట్యూబ్ సిరీస్‌ల నుంచే ప్రేమలో ఉన్నారు. ప్రేమలో ఉంటూనే లివింగ్ రిలేషన్ కంటిన్యూ చేస్తున్నారట. ఈ జంట కూడా పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తోంది అని టాక్. రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీకి ఎంట్రీ ఇచ్చారు ఇద్దరు. సోనియా సింగ్, పవన్ సిద్ధూ కలిసి నటించిన శశి మథనం సిరీస్ మంచి టాక్ ను సొంతం చేసుకుంది.