https://oktelugu.com/

Kamal Haasan: ప్రతి డైరెక్టర్ కమలహాసన్ తో సినిమా చేయడానికి ఎందుకు ఎదురుచూస్తూ ఉంటారో తెలుసా..?

Kamal Haasan: ఇప్పటి జనరేషన్ వరకు ప్రతి ఒక్కరు ఒక మంచి కథ దొరికితే మాత్రం కమలహాసన్ తో సినిమా చేయాలని చూస్తూ ఉంటారు.ప్రతి ఒక్క దర్శకుడు రాసుకునే మంచి కథ కు మొదటి ఛాయిస్ కమల్ హాసన్ గారే కావడం విశేషం... ఇప్పటివరకు ఆయన ఎంటర్ కెరియర్లో అద్భుతమైన పాత్రలను పోషించి ఎన్నో అవార్డులను..

Written By:
  • Neelambaram
  • , Updated On : July 8, 2024 / 04:26 PM IST

    Do you know why every director is waiting to make a movie with Kamal Haasan

    Follow us on

    Kamal Haasan: తెలుగు తమిళ్ ఇండస్ట్రీ లో ఉన్న చాలామంది దర్శకులు స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని ప్రయత్నం చేస్తు ఉంటారు. ఎందుకంటే వాళ్ల టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి స్టార్ హీరోలైతేనే వర్కౌట్ అయితుందనే ఉద్దేశంతో వాళ్లు స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తూ ఉంటారు.

    దాని ద్వారా వాళ్ళ మార్కెట్ కూడా పెంచుకొని రెమ్యూనరేషన్ పరంగా కూడా ఎక్కువగా తీసుకోవచ్చనే ఉద్దేశ్యంతో వాళ్లు ఇలాంటి కార్యక్రమాన్ని చేపడుతూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటే కొంతమంది మాత్రం ఒక మంచి కంటెంట్ ని రాసి ప్రేక్షకులకి అంతే జెన్యూన్ గా ఆ కథను చెప్పాలనుకుంటారు. అలాంటి దర్శకులు కమల్ హాసన్ ని ఎంచుకొని ఆయనతో ఆ సినిమా చేయాలని చూస్తుంటారు. ఒక క్యారెక్టర్ కి న్యాయం చేయాలంటే ఇండియాలో ఉన్న హీరోలందరిలో కమలహాసన్ ను మించిన నటులు మరొకరు లేరనే చెప్పాలి.

    ఇక అప్పటి నుంచి ఇప్పటి జనరేషన్ వరకు ప్రతి ఒక్కరు ఒక మంచి కథ దొరికితే మాత్రం కమలహాసన్ తో సినిమా చేయాలని చూస్తూ ఉంటారు.ప్రతి ఒక్క దర్శకుడు రాసుకునే మంచి కథ కు మొదటి ఛాయిస్ కమల్ హాసన్ గారే కావడం విశేషం… ఇప్పటివరకు ఆయన ఎంటర్ కెరియర్లో అద్భుతమైన పాత్రలను పోషించి ఎన్నో అవార్డులను కూడా అందుకున్నాడు. తను చేసే క్యారెక్టర్ లో ఎంతలా జీవిస్తాడు అనేది ఆయన గత సినిమాలను చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ప్రత్యేకించి ఆ క్యారెక్టర్ లోనే నటిస్తూ ఉంటాడు.

    అందులో డివియేషన్స్ లేకుండా ఆ పాత్ర ఎలా మాట్లాడుతాడు, ఎలా తింటాడు, ఎలా నడుస్తాడు, అందరిని ఎలా గమనిస్తాడు, ఎలా పడుకుంటాడు అనే ప్రతి చిన్న మైనర్ ఇష్యూ ని కూడా ఆయన అబ్జర్వ్ చేసి ఆ క్యారెక్టర్ లో ది బెస్ట్ పర్ఫామెన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే ఆయన లోక నాయకుడు అయ్యాడు…ఇక ఇప్పటికీ కూడా అదే డెడికేషన్ తో సినిమాలు చేస్తున్నాడు…