Rohit Sharma : ఆఫ్ఘనిస్తాన్ ను మోసం చేసిన రోహిత్ .. మ్యాచ్ గెలిచేందుకు ఐసీసీ నిబంధనలను తుంగలో తొక్కాడా?

Rohit Sharma సెకండ్ సూపర్ ఓవర్లో రోహిత్ శర్మ మళ్ళీ బ్యాటింగ్ కి వచ్చాడు. ధాటిగా బ్యాటింగ్ చేయడంతో టీమ్ ఇండియా సెకండ్ సూపర్ ఓవర్లో గెలిచింది. వాస్తవానికి ఐసీసీ నిబంధనల ప్రకారం.. ఫస్ట్ సూపర్ ఓవర్ లో బ్యాటర్ డిస్మిస్ అయితే.. తర్వాత సూపర్ ఓవర్ లో బ్యాటింగ్ చేసేందుకు అవకాశం ఉండదు. అయితే ఇక్కడ రోహిత్ శర్మ డిస్మిస్ కాలేదు. రిటైర్డ్ అవుట్ అయ్యాడు. అయితే టీమిండియా సెకండ్ సూపర్ ఓవర్లో గెలవడంతో ఆఫ్గనిస్తాన్ ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.

Written By: NARESH, Updated On : July 8, 2024 4:19 pm

Rohit Sharma

Follow us on

Rohit Sharma : ధోని తర్వాత టీమిండియా కు t20 వరల్డ్ కప్ అందించిన ఘనత రోహిత్ శర్మది. వెస్టిండీస్ వేదికగా జరిగిన టి20 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై టీమిండియా ఏడుపరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 17 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. టీమ్ ఇండియాను అన్ని విభాగాలలో ముందుండి నడిపించిన రోహిత్ శర్మ ను జాతీ యావత్తు వెయ్యినోళ్ల కొనియాడుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక మీడియా నుంచి అంతర్జాతీయ మీడియా వరకు రోహిత్ శర్మను ఆకాశానికి ఎత్తేస్తోంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఓ వీడియో రోహిత్ శర్మలో మరో కోణాన్ని కూడా చూపిస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఈ ఏడాది జనవరిలో ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో టీమిండియా టి20 సిరీస్ ఆడింది. ఇందులో భాగంగా మూడవ టి20 మ్యాచ్లో టీమిండియా 212 స్కోర్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఈ స్కోర్ ను సమం చేసింది.. దీంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్ కు దారితీసింది. సూపర్ ఓవర్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 17 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని చేదించేందుకు టీమిండియా రంగంలోకి దిగింది. ఐదు బంతులకు 16 పరుగులు చేసింది. ఆరో బంతికి స్ట్రైకర్ గా యశస్వి జైస్వాల్ ఉన్నాడు. అయితే చివరి బంతికి రెండు పరుగులు తీయాల్సి వస్తే వేగంగా పరిగెత్తగలడని భావించి నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న రోహిత్ శర్మ రిటైర్డ్ ఔట్ గా మైదానంలోకి వెళ్లిపోయాడు. దీంతో అతడి స్థానంలో రింకూ సింగ్ వచ్చాడు. అయితే చివరి బంతికి ఒకటే పరుగు రావడంతో.. మ్యాచ్ మళ్లీ సెకండ్ సూపర్ ఓవర్ కు దారి తీసింది.

సెకండ్ సూపర్ ఓవర్లో రోహిత్ శర్మ మళ్ళీ బ్యాటింగ్ కి వచ్చాడు. ధాటిగా బ్యాటింగ్ చేయడంతో టీమ్ ఇండియా సెకండ్ సూపర్ ఓవర్లో గెలిచింది. వాస్తవానికి ఐసీసీ నిబంధనల ప్రకారం.. ఫస్ట్ సూపర్ ఓవర్ లో బ్యాటర్ డిస్మిస్ అయితే.. తర్వాత సూపర్ ఓవర్ లో బ్యాటింగ్ చేసేందుకు అవకాశం ఉండదు. అయితే ఇక్కడ రోహిత్ శర్మ డిస్మిస్ కాలేదు. రిటైర్డ్ అవుట్ అయ్యాడు. అయితే టీమిండియా సెకండ్ సూపర్ ఓవర్లో గెలవడంతో ఆఫ్గనిస్తాన్ ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. టీమిండియా కెప్టెన్ ఐసీసీ నిబంధనలను తుంగలో తొక్కాడని అంతర్గతంగా వ్యాఖ్యానించారు. మరోవైపు వెస్ట్రన్ మీడియా రోహిత్ శర్మ వ్యవహరించిన తీరుపై అక్కసు వెళ్ళగక్కింది. ఏవేవో విమర్శలు చేసింది. ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ.. టి20 క్రికెట్ చరిత్రలో ఆఫ్ఘనిస్తాన్ -భారత్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ ఎప్పటికీ ప్రత్యేకమే.