https://oktelugu.com/

Manchu Manoj: కూతురు పేరు ప్రకటించిన మంచు మనోజ్… వింటే ఆ పాన్ ఇండియా మూవీ గుర్తుకు వస్తుంది!

Manchu Manoj: తాజాగా ఆ చిన్నారికి బారసాల నిర్వహించారు. పేరు పెట్టారు. కాగా తన కూతురు పేరు రివీల్ చేస్తూ మంచు మనోజ్ ఒక లేఖను పంచుకున్నారు. అంతేకాదు కొన్ని ఫోటోలు కూడా షేర్ చేశాడు. అలాగే ఆ పేరు పెట్టడానికి కారణాలు ఏంటో వివరించారు.

Written By:
  • S Reddy
  • , Updated On : July 8, 2024 / 04:35 PM IST

    Manchu Manoj daughter name goes viral

    Follow us on

    Manchu Manoj: హీరో మంచు మనోజ్, భూమా మౌనిక దంపతులు తన ముద్దుల కూతురుకి నామకరణం చేశారు. ఏప్రిల్ 13న మంచు మనోజ్ భార్య మౌనిక ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఆ చిన్నారికి బారసాల నిర్వహించారు. పేరు పెట్టారు. కాగా తన కూతురు పేరు రివీల్ చేస్తూ మంచు మనోజ్ ఒక లేఖను పంచుకున్నారు. అంతేకాదు కొన్ని ఫోటోలు కూడా షేర్ చేశాడు. అలాగే ఆ పేరు పెట్టడానికి కారణాలు ఏంటో వివరించారు.

    మంచు మనోజ్, మౌనిక దంపతులు తమ కూతురికి ‘ దేవసేన శోభా ఎంఎం ‘ అని పేరు పెట్టారు. ఈ పేరు పెట్టడానికి కారణం ఏంటో వివరించారు. ‘ మీ అందరి ఆశీస్సులతో మా బిడ్డ ‘ దేవసేన శోభా ఎంఎం ‘ ను మీకు పరిచయం చేస్తున్నాం. ఆ పరమశివుడి భక్తులమైన మేము .. మా చిన్నారి తల్లికి సాక్ష్యాత్తు ఆ శివుని కుటుంబంలో సుబ్రమణ్య స్వామి సతీమణి అయిన ‘ దేవసేన ‘ పేరును పెట్టుకున్నాం.

    మా అత్తగారు స్వర్గీయ శ్రీమతి శోభా నాగిరెడ్డి గారి పేరు నుంచి ‘ శోభా ‘ అనే పేరును తీసుకున్నాం. వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మా కుటుంబం పై ఉంటాయి. మా జీవితంలో అండగా ఉంటూ మాకు కొండంత బలంగా నిలుస్తున్న మా తల్లిదండ్రులు మోహన్ బాబు గారు శ్రీమతి నిర్మల గారి ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉంటాయి. నా జీవితంలో మొదటి నుంచి ప్రతి విషయంలోనూ తోడుగా ఉంటున్న మా అక్క మంచు లక్ష్మి గారికి ధన్యవాదాలు.

    లేఖలో మంచు మనోజ్ తన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశారు. కాగా బాహుబలి మూవీలో హీరోయిన్ అనుష్క పేరు దేవసేన కావడం విశేషం. కాగా గత ఏడాది భూమా మౌనికను ఇరు కుటుంబాల అంగీకారంతో మంచు మనోజ్ వివాహం చేసుకున్నాడు. మాజీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ల కుమార్తెనే భూమా మౌనిక. వీరిద్దరిదీ రెండవ వివాహం. మౌనికను మనోజ్ వివాహం చేసుకోవడం మోహన్ బాబుకు ఇష్టం లేదనే వాదన ఉంది. మనోజ్ పెళ్ళికి విష్ణు దూరంగా ఉన్నారు. మోహన్ బాబు చివరి నిమిషంలో హాజరయ్యాడు.