Bigg Boss Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లో ఎంట్రీ ఇస్తున్న ఈ గ్లామరస్ యాంకర్ ఎవరో తెలుసా…

Bigg Boss Season 8: బూతద్దం భాస్కర్ అనే సినిమాలో నటించిన తర్వాత ఈమె టీవీ షో లకు,సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చింది. బూతద్దం భాస్కర్ సినిమాలో ఈమె నెగటివ్ పాత్రలో నటించటం జరిగింది.ఈ గ్లామరస్ యాంకర్ మరెవరో కాదు తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న...

Written By: Chai Muchhata, Updated On : July 12, 2024 2:45 pm

Anchor Varshini entering Bigg Boss Season 8

Follow us on

Bigg Boss Season 8: బుల్లితెర మీద ప్రసారం అయ్యే పలు టీవీ షోస్ కు యాంకర్ గా చేసిన ఈ ముద్దుగుమ్మ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఈమె తన గ్లామర్ తో,యాంకరింగ్ తో తెలుగు ప్రేక్షకులను కట్టి పడేసింది.ఈమె పలు టీవీ షో లలో యాంకరింగ్ తో పాటు పలు సినిమాలలో కూడా నటించింది.వెబ్ సిరీస్ లలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించింది.అయితే బూతద్దం భాస్కర్ అనే సినిమాలో నటించిన తర్వాత ఈమె టీవీ షో లకు,సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చింది. బూతద్దం భాస్కర్ సినిమాలో ఈమె నెగటివ్ పాత్రలో నటించటం జరిగింది.ఈ గ్లామరస్ యాంకర్ మరెవరో కాదు తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న యాంకర్ వర్షిణి.కొంచెం గ్యాప్ తర్వాత ఈమె తన దృష్టి మొత్తాన్ని సినిమాలపై సారించినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం యాంకర్ వర్షిణికి సంబంధించిన ఒక క్రేజీ వార్త సోషల్ మీడియా మాధ్యమాలలో బాగా వైరల్ అవుతుంది.బుల్లితెర మీద ప్రసారం అయ్యే ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 కు యాంకర్ వర్షిణి కంటెస్టెంట్ గా కన్ఫార్మ్ అయిపోయిందని సమాచారం.ఇక బుల్లితెర మీద మంచి పాపులారిటీని తెచ్చుకున్న బిగ్ బాస్ రియాలిటీ షో గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇప్పటికే బిగ్ బాస్ 7 సీజన్లను పూర్తి చేసుకుంది.ఇక బిగ్ బాస్ 8 వ సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మేకర్స్ ఈ బిగ్ బాస్ 8 వ సీజన్ ను స్టార్ట్ చేసేందుకు అన్ని రెడీ చేసుకున్నారు అని తెలుస్తుంది.బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ ను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు ఈ షో మేకర్స్.ఈ క్రమం లోనే ఇప్పటి వరకు చాల పేర్లు వినిపించాయి.

అలా వినిపిస్తున్న పేర్లలో ప్రధానంగా కుమారి ఆంటీ,వేణు స్వామి,బర్రెలక్క పేర్లు ఉన్నాయి.ఇప్పుడు యాంకర్ వర్షిణి కూడా బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ గా రాబోతుంది అనే వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది.యాంకర్ వర్షిణి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడితే ఆమె చేసే సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎప్పుడు సందడిగా ఉండే యాంకర్ వర్షిణి బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెడితే రచ్చ రచ్చే అని చెప్పచ్చు.ఈమె సరదాగా తనకు వచ్చిరాని తెలుగు తో చేసే అల్లరికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు.వర్షిణి డాన్స్ కు కూడా బాగా ఫాలోయింగ్ ఉంది.యాంకర్ వర్షిణి బిగ్ బాస్ హౌస్ లోకి వెళితే ఎలా ఉంటుంది అని దాని గురించి కూడా ఆమె అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు.

హౌస్ లో ఆమె అందరితో ఎలా ఉంటుంది…ఎలా గొడవ పడుతుంది..తనను తానూ ఎలా డిఫెండ్ చేసుకుంటుంది..అసలు బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ లు ఎలా చేస్తుంది అనే విషయాలు ఆసక్తిని పెంచుతున్నాయి.ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 8 కి ఫైనల్ అయినా కంటెస్టెంట్స్ ఎవరో బిగ్ బాస్ షో ప్రారంభం అయ్యే రెండు రోజుల ముందుకు వరకు కూడా పక్కాగా తెలియదు.షూట్ ప్రారంభం అయ్యే రెండు రోజుల ముందు ఎవరైనా ఏదో ఒక కంటెస్టెంట్ పేరు లీక్ చేస్తే తప్పా ఎవరికి తెలిసే అవకాశం లేదు.బిగ్ బాస్ సీజన్ 8 ఆగష్టు నెల మొదటి వారం లో లేదా నాలుగవ వారం లో స్టార్ట్ చేస్తారు అని సమాచారం.మరీ బిగ్ బాస్ సీజన్ 8 లో ఒకవేళ యాంకర్ వర్షిణి ఉంటే ఎలాంటి సందడి చేస్తుందో మరి కొన్ని రోజుల్లో తెలుస్తుంది.