Teja Sajja: బాలనటులుగా నటించిన ఎంతో మంది ఇప్పుడు ఇండస్ట్రీ లో సూపర్ స్టార్స్ గా కొనసాగుతున్నారు. అలా సూపర్ స్టార్స్ గా కొనసాగుతున్న వాళ్లందరికీ బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ ఉంది. కానీ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా, బాలనటుడిగా ఎన్నో వందల సినిమాల్లో నటించి, స్టార్ కిడ్ గా పేరు తెచ్చుకొని, ఆ తర్వాత 15 ఏళ్ళ గ్యాప్ తీసుకొని ‘ఓ బేబీ’ చిత్రం తో వెండితెర అరంగేట్రం చేసి సక్సెస్ ని అందుకొని, నేడు పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసే రేంజ్ హిట్స్ ఇస్తున్న ఏకైక నటుడు తేజ సజ్జ(Teja Sajja) మాత్రమే. ఆయన లాగానే బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేని బాలనటులు పెద్దయ్యాక హీరోలుగా, హీరోయిన్స్ గా ఎంట్రీలు ఇచ్చి సక్సెస్ కాలేకపోయారు. మొదటి సినిమాతోనే వెనుతిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ తేజ సజ్జ మాత్రం ఇండస్ట్రీ లో హీరోగా బలమైన సంతకం చేసేసాడు.

Also Read: కిష్కింధపురి vs మిరాయి: ఏ సినిమా హిట్? ఏది ఫ్లాప్?
‘హనుమాన్’ చిత్రం పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టిన తేజ సజ్జ,నేడు విడుదలైన ‘మిరాయ్’ చిత్రం తో మరో భారీ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా కూడా హనుమాన్ లాగా ఫుల్ రన్ లో 400 కోట్లు రాబడుతుందో లేదో తెలియదు కానీ, మొదటి రోజు ఓపెనింగ్ వసూళ్లు మాత్రం 50 కోట్ల రూపాయలకు పైగానే రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఇది సాధారణమైన విషయం కాదు. ఇంతటి రేంజ్ కి తేజ సజ్జ బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన కష్టం తోనే వచ్చాడట. ఇప్పటి వరకు ఆయన ఎన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చి ఉంటాడు, ఒక్క ఇంటర్వ్యూ లో కూడా తన తల్లితండ్రుల బ్యాక్ గ్రౌండ్ ఏమిటో చెప్పలేదు. మా కుటుంబం మంచిగా స్థిరపడిన కుటుంబమే, మా అన్నయ్య ఫ్యామిలీ బిజినెస్ ని చూసుకుంటున్నాడు. నా కజిన్స్ మరియు మా కుటుంబానికి చెందిన ప్రతీ ఒక్కరు ఇతర వ్యాపారాలు చేసుకుంటున్నారు.
నేను ఒక్కడినే సినీ ఇండస్ట్రీ కి చెందిన వ్యక్తిని అంటూ చెప్పుకొచ్చాడు. తేజ సజ్జ అతని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పకపోయినా,మేము మాకున్న విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం సేకరించాము. ఆ సమాచారం ప్రకారం చూస్తే తేజ సజ్జ అన్నయ్య పేరు కృష్ణ కిరీటి సజ్జ. ఈయన వ్యాపార రంగం లో ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉన్నాడు. ఈయన ఫేస్ బుక్ లో కూడా ఉన్నాడు, కావాలంటే ఆ పేరుతో వెతికి చూడండి. ఇక ఈయన తండ్రి పేరు రామ కృష్ణ సజ్జ. ఈయన గతంలో డివోస్ ల్యాబ్స్ లో పని చేసాడట. అంతే కాకుండా ఫార్మా బిజినెస్ లో ఉన్నత స్థాయికి చేరిన ప్రముఖులలో ఒకరు. ఈ దేశం లో నష్టాలు లేని బిజినెస్ ఏదైనా ఉందా అంటే అది ఫార్మా బిజినెస్ నే, ఆ వ్యాపారం లో ఉన్నత స్థాయికి చేరుకున్న వ్యక్తి అంటేనే ఆయన ఏ రేంజ్ ఆస్తి పరుడో అర్థం చేసుకోవచ్చు. తల్చుకుంటే తేజ సజ్జ ని హీరో గా పెట్టి ఒక భారీ బడ్జెట్ సినిమాని తీసేంత కెపాసిటీ ఆయన తండ్రికి ఉంది. కానీ అలా కాకుండా తన సొంత కాళ్ళ మీద నిలబడాలని చూసాడు తేజ సజ్జ. ఈరోజు నిలబడ్డాడు, టాలీవుడ్ గర్వపడే హీరోలలో ఒకరిగా నిలిచాడు. రాబోయే రోజుల్లో ఈయన ఇంకా ఎంతటి ఉన్నత స్థాయికి చేరుకుంటాడో చూడాలి.