Kishkindhapuri vs Mirai: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ దక్కనటువంటి క్రేజ్ ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోల చాలా మంది ఉన్నారు. ఇక వాళ్ళ బాటలో నడుస్తున్న యంగ్ హీరోలు సైతం సూపర్ సక్సెస్ లను సాధించడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. కిష్కిందపురి సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా యావరేజ్ టాక్ ను సంపాదించుకుంది. హర్రర్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని అందరు అనుకున్నారు. కానీ యావరేజ్ గానే ఉందని సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకులు తెలియజేయడం విశేషం…
ఇక తేజ సజ్జా లాంటి హీరో సైతం మిరాయి సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తుందంటూ మొదటి నుంచి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ప్రేక్షకులు సైతం ఈ సినిమా మీద మంచి అంచనాలైతే పెట్టుకున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుని ముందుకు దూసుకెళ్తూ ఉండటం విశేషం…
తేజ సజ్జా ఇంతకుముందు చేసిన హనుమాన్ సినిమా ఆధ్యాత్మికమైన కథతో వచ్చి అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఇక ఇప్పుడు మిరాయి కూడా డివిషనల్ కథతోనే వచ్చి సూపర్ సక్సెస్ ను సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తుంది. కార్తీక్ ఘట్టమనేని సైతం ఈ సినిమా విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరించాడు.
ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని ప్రేక్షకుడికి అర్థమయ్యే ధోరణిలో చెప్పే ప్రయత్నం చేశాడు… అందువల్లే ఈ సినిమాకి ఇప్పుడు సక్సెస్ ఫుల్ టాక్ రావడమే కాకుండా ప్రేక్షకులందరికి సినిమాను చూడడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…ఇక ఈ వీకెండ్స్ లో ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా భారీ కలెక్షన్స్ ను కూడా కొల్లగొడుతోందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
మిరాయి vs కిష్కిందపురి రెండు సినిమాల్లో మిరాయి సినిమా సూపర్ హిట్ టాక్ నైతే సొంతం చేసుకుంది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా లాంగ్ రన్ లో 500 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టే అవకాశాలైతే ఉన్నాయి. కిష్కింధపురి యావరేజ్ టాక్ ను సంపాదించుకుంది. ఇక మిరాయి ముందు కిష్కింధపురి సినిమా నిలబడే అవకాశాలైతే లేవనే చెప్పాలి. ఈ వీకెండ్స్ కిష్కింధపురి సినిమా ఎంత కలెక్షన్స్ ని రాబడుతోంది అనేది తెలియాలంటే మాత్రం మరో రెండు రోజులపాటు వెయిట్ చేయాల్సిందే…