spot_img
Homeఎంటర్టైన్మెంట్Shah Rukh Khan: టీమిండియాలో షారుఖ్ ఖాన్ అల్లుడు.. ఎవరో తెలుసా..?

Shah Rukh Khan: టీమిండియాలో షారుఖ్ ఖాన్ అల్లుడు.. ఎవరో తెలుసా..?

Shah Rukh Khan: బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న హీరో షారుఖ్ ఖాన్… ఇక బాలీవుడ్ బాద్షా గా కూడా తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఇక ఈయన చేసిన పఠాన్, జవాన్ లాంటి సినిమాలు గతేడాది 1000 కోట్లకు పైన వసూళ్లను రాబట్టడం నిజంగా చాలా మంచి విషయమనే చెప్పాలి. అయితే ఈ సినిమాలకు ముందు షారుఖ్ ఖాన్ చాలా ఫ్లాప్ సినిమాలని ఎదుర్కొన్నప్పటికీ ఈ రెండు సినిమాలు ఆయన కెరియర్ లో చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం సౌత్ సినిమాల హవా బాలీవుడ్ లో ఎక్కువగా నడుస్తున్నప్పటికీ, ఈయన రెండు సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని కొట్టడం నిజంగా ఒక వంతుకు గ్రేట్ అనే చెప్పాలి.

ఇక ఇదిలా ఉంటే షారుఖ్ ఖాన్ ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఒక ప్లేయర్ ను అల్లుడు అని పిలుస్తాడనే విషయం మనలో చాలామందికి తెలియదు. ఇక రీసెంట్ గా ‘స్టార్ స్పోర్ట్స్ ‘ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన షారుఖ్ ఖాన్ ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఉన్న విరాట్ కోహ్లీని తను అల్లుడు అని పిలుస్తానని చెప్పాడు. నిజానికి వీళ్ళ మధ్య ఎలాంటి బంధుత్వం లేనప్పటికీ కేవలం వీళ్ళ మధ్య ఉన్న స్నేహపూర్వకమైన బంధం ద్వారానే తను అలా పిలుస్తాడనే క్లారిటీ కూడా ఇచ్చాడు. అయితే షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన “రబ్ నే బనాదీ జోడీ” సినిమాతోనే విరాట్ కోహ్లీ భార్య అయిన అనుష్క శర్మ బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో మరికొన్ని సినిమాలు కూడా తెరకెక్కాయి. ఇక అనుష్క, కోహ్లీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నా క్రమంలో అనుష్క ను కలవడానికి కోహ్లీ సెట్స్ కి వచ్చేవాడని, నేను అక్కడ కోహ్లీ తో చాలాసేపు గడిపే వాడినని తన గురించి ఆయనకు బాగా తెలుసని చెప్పాడు. అలాగే కోహ్లీ అనుష్క ఇద్దరు డేటింగ్ చేసుకుంటున్న సమయంలోనే అనుష్క విరాట్ గురించి నాకు పూర్తిగా తెలుసని చెప్పాడు. అందుకే విరాట్ కోహ్లీ ని “బాలీవుడ్ అల్లుడు” అని పిలుచుకుంటామని తను చెప్పడం విశేషం…

ఇక మొత్తానికైతే షారుక్ ఖాన్, విరాట్ కోహ్లీ మధ్య మంచి స్నేహ పూర్వకమైన బంధం అయితే ఉంది. ఇక ఈ బంధంతోనే గత ఎడాది ఐపీఎల్ సీజన్ లో షారుక్ ఖాన్ నటించిన పఠాన్ సినిమాలోని ఒక సాంగ్ కి ఇద్దరు కలిసి స్టెప్పులు వేయడం విశేషం…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...

Talliki Vandanam Scheme 2026: తల్లికి వందనం.. రూ.13 వేలు జమ.. చెక్ చేసుకోండి!

Talliki Vandanam Scheme 2026: ఏపీ ప్రభుత్వం ఈరోజు ప్రతిష్టాత్మక పథకానికి సంబంధించి నిధులు జమ చేయనుంది. పాఠశాలతో పాటు ఇంటర్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద చదువుకు సాయం అందించనుంది....

NEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్...

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...
Oktelugu Epaper
Exit mobile version