spot_img
Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీAI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు ఊహించని ఉపద్రవం వచ్చింది. అది ఇప్పుడు ప్రారంభంలోనే ఉంది. ఇది ఇలా కొనసాగితే భవిష్యత్తు కాలంలో ఏదీ ఉండదు. ఏది ముందుకు కొనసాగదు.

ఐటి వ్యవస్థ ఏఐ వల్ల ఎంతటి మార్పులకు గురైందో.. అంతకు మించిన ఒత్తిడి ఎదుర్కొంటున్నది. ఈ ఒత్తిడి వల్ల చాలామంది ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. ఖాళీగా రోడ్లమీద తిరుగుతున్నారు. ఏం చేయాలో తెలియడం లేదు. కొత్త ఉద్యోగాలు దొరకడం లేదు. ఉన్న ఉద్యోగాలు పోయాయి. కొందరు కార్లు నడుపుతున్నారు. మరికొందరేమో హోటల్స్ పెట్టుకున్నారు. ఇంకొందరేమో రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు.. ఐటి పరిశ్రమను మాత్రమే కాదు, ఏకంగా మూలాలనే ఏఐ దెబ్బతీస్తోంది. ఏఐ దెబ్బ వల్ల సాంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సులు మాత్రమే కాకుండా.. డిగ్రీలు కూడా కాలగర్భంలో కలిసిపోతున్నాయి.

సాధారణ డిగ్రీలను ఇప్పటి కాలం పిల్లలు ఇష్టపడడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 929 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఇందులో మొత్తంగా 4.37 లక్షల సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది కేవలం 1.4 లక్షల మంది మాత్రమే డిగ్రీలో జాయిన్ అయ్యారు. దాదాపు 70 శాతం కాలేజీలలో చేరికలు లేవు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న కాలేజీలలో కనీసం 15% సీట్లు కూడా భర్తీ కాలేదు. ఈ నేపథ్యంలో మరోసారి కౌన్సిలింగ్ నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది.

మొదటి దశలోనే సీట్లు భర్తీ కాలేదు. ఇలాంటి సమయంలో రెండవ దశలో మాత్రం అవకాశం ఇస్తే ఏం ఉపయోగం ఉంటుందని విద్యావేత్తలు అంటున్నారు.ఏఐ వల్ల ఎడ్యకేషన్ సిస్టం కూడా నాశనం అవుతుందని.. మూలాలు తీవ్రస్థాయిలో దెబ్బతింటున్నాయని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితికి ప్రారంభంలోనే అడ్డుకట్ట వేయాలని.. లేకపోతే భవిష్యత్తు కాలంలో తీవ్రస్థాయిలో పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు.

ఒకప్పటి మాదిరిగా డిగ్రీ పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు లభించడం లేదు. పైగా ఐటీ పరిశ్రమలో సాధారణ డిగ్రీలు చేసిన వారికి ఉపాధి దొరకడం లేదు. ఇలాంటి సమయంలో ఆ విద్యార్థులు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ వైపు వెళ్లిపోతున్నారు. అందులో ఉన్న రకరకాల టూల్స్ నేర్చుకొని ఉపాధి పొందవచ్చు అని అనుకుంటున్నారు. అయితే డిగ్రీ చేస్తే వెంటనే ఉపాధి లభిస్తుందని నమ్మకం ప్రభుత్వాలు కల్పించడం లేదు. అందువల్లే విద్యార్థులు ఇలాంటి మార్గాన్ని ఎంచుకుంటున్నారు. దీనివల్ల భవిష్యత్తులో అనేక రకాల సమస్యలు ఎదురు కావచ్చని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...

Talliki Vandanam Scheme 2026: తల్లికి వందనం.. రూ.13 వేలు జమ.. చెక్ చేసుకోండి!

Talliki Vandanam Scheme 2026: ఏపీ ప్రభుత్వం ఈరోజు ప్రతిష్టాత్మక పథకానికి సంబంధించి నిధులు జమ చేయనుంది. పాఠశాలతో పాటు ఇంటర్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద చదువుకు సాయం అందించనుంది....

NEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్...

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...
Oktelugu Epaper
Exit mobile version