Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు సినిమాలోని ఎవ్వరూ గమనించని విషయాలివే…

"హరిహర వీరమల్లు" అనే సినిమాకు సంబంధించిన టీజర్ ఇవాళ్ళ రిలీజ్ అయింది. అయితే ఈ టీజర్ ని కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో కొన్ని అనూహ్యమైన విషయాలు మనకు తెలుస్తాయి...

Written By: Gopi, Updated On : May 2, 2024 12:47 pm

Things in Harihara Veeramallu movie that no one notices

Follow us on

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాల ద్వారానే ఆయన ఎక్కువ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. అలాగే ఆయన వ్యక్తిత్వం వల్ల కూడా ఆయనకు అభిమానులుగా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక ప్రస్తుతానికి ఆయన పాలిటిక్స్ లో చాలా బిజీగా కొనసాగుతున్నప్పటికీ సినిమాలను మాత్రం ఎక్కడ వదిలిపెట్టకుండా అవకాశం దొరికిన ప్రతిసారి సినిమాలు చేస్తూ ముందుకు కదులుతున్నాడు.

ఇక ఈ సినిమాల్లో వచ్చిన డబ్బుతోనే పేదలకు కూడా ఆయన సహాయం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఆయన గత నాలుగు సంవత్సరాల కిందట మొదలుపెట్టిన “హరిహర వీరమల్లు” అనే సినిమాకు సంబంధించిన టీజర్ ఇవాళ్ళ రిలీజ్ అయింది. అయితే ఈ టీజర్ ని కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో కొన్ని అనూహ్యమైన విషయాలు మనకు తెలుస్తాయి…ఇక అధ్యంతం ఆసక్తికరంగా కట్ చేసిన ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ ఒక దొంగగా నటించబోతున్నాడు అనే విషయం మనకు చాలా స్పష్టంగా అర్థం అవుతుంది.

అలాగే పీడిత ప్రాంతాన్ని కాపాడడానికి పవన్ కళ్యాణ్ ఒక అనూహ్యమైన రీతిలో దొంగతనాలు చేసి వాళ్ళని కాపాడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక మొగల్ చక్రవర్తి దగ్గర నుంచి చాలా విలువైన వాటిని దోచుకొని జనాల్ని ఆదరిస్తూ ఉంటాడు.ఈ క్రమంలోనే తనతో ఉన్న కొంతమంది తనని ఆ మొగల్ చక్రవర్తి కి పట్టిస్తారు. ఇక ఈ టీజర్ లో చూపించినట్టుగా ఒక పెద్ద ఫైట్ చేసి తను అక్కడి నుంచి బయటపడతాడు అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక ఈ సినిమా స్టోరీ మాత్రం అన్యాయం గా జనాలను హింసిస్తున్న మొగల్ చక్రవర్తి దాచుకున్న సొమ్మును దోచుకొని పేదవాళ్ల ని కాపాడటమే మెయిన్ థీమ్ గా తెలుస్తుంది…

అలాగే జనాలను దోచుకొని పిడించేవాళ్లను కూడా వీరమల్లు క్యారెక్టర్ లో ఉన్న పవన్ కళ్యాణ్ వాళ్ళని చంపేసి అక్కడున్న జనాలందరికి ఫ్రీడమ్ ఇవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది…ఇక ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ భారీ సక్సెస్ అందుకోబోతున్నాడు అంటూ ఇప్పటికే తన అభిమానులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ టీజర్ కూడా అద్భుతంగా ఉంది అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ టీజర్ మీద భారీ ఎత్తున ప్రశంసలైతే దక్కుతున్నాయి…