Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా వచ్చిన సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటాయి. ఆయన సినిమాల్లో మాస్ యాక్షన్స్ సన్నివేశాలకు ఎక్కువ స్కోప్ ఉంటుంది. బీ,సీ సెంటర్లో అతని కోసం ఆగని కోసం రక్తాలు చిందించే అభిమానులు ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. తన ఎంటైర్ కెరీర్లో ఆయన చేసిన సినిమాలన్నీ మాస్ సినిమాలే కావడంతో యావత్ ప్రేక్షకులు అందరు అతనికి నీరాజనాలు పడుతున్నారు. ఇక ఈరోజు ‘అఖండ 2’ సినిమా రిలీజ్ అవ్వనున్న నేపథ్యంలో ఈ సినిమాకి కూడా చాలా మంచి క్రేజ్ అయితే దక్కుతోంది. ఇక ఇలాంటి క్రమంలోనే బాలయ్య ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే వరుసగా 5వ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నవాడవుతాడు.
బాలయ్య బాబుకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ అంటే విపరీతమైన ఇష్టం. వాళ్ళ నాన్నగారు కావడం వల్ల ఎన్టీఆర్ అంటే ఇష్టం ఏర్పడలేదట. తను నటనతో బాలయ్య బాబుని ఆకట్టుకున్నాడు కాబట్టి సీనియర్ ఎన్టీఆర్ అంటే తనకు ఒక దేవుడు లాంటివాడని బాలయ్య ఎప్పుడు చెబుతూ ఉంటాడు.
ఇక సీనియర్ ఎన్టీఆర్ కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఈ తరం హీరోల్లో బాలయ్య బాబుకి బాగా నచ్చిన హీరో ఎవరు అని అంటే ప్రభాస్ అని చెబుతున్నాడు. గతంలో ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పడం విశేషం…ప్రభాస్ యాక్టింగ్ బాగుంటుందని పాన్ ఇండియాలో తెలుగు సినిమా స్థాయిని పెంచాడు.
అందువల్లే ప్రభాస్ అంటే తనకు అమితమైన ఇష్టమని ప్రభాస్ సినిమాలు ఎక్కువగా చూస్తూ ఉంటానని, బాలయ్య గతంలో చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య లాంటి స్టార్ హీరో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాడు. 60 సంవత్సరాల పైబడిన వయసులో కూడా ఆయన భారీ స్టంట్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడంటే నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…