Avatar 3: హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో జేమ్స్ కామెరూన్ కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన సినిమాలు తీసే స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు ఉన్నప్పటికి ఆయన శైలిని అందుకోవడం మిగతా దర్శకుల వల్ల కాదు. ఎందుకంటే ఆయన ఒక జెన్యూన్ ప్రోడక్ట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాడు. టెక్నాలజీని వాడుకొని భారీ ఎమోషన్స్ ను క్రియేట్ చేస్తూ ప్రేక్షకుడిని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లడంలో జేమ్స్ కామెరూన్ మొదటి స్థానంలో ఉంటాడు. ఒక రకంగా మన రాజమౌళికి జేమ్స్ కామెరూన్ ఇన్స్పిరేషన్ అని చాలా సందర్భాల్లో చెప్పాడు. రాజమౌళి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కెరియర్ స్టార్ట్ చేసి పాన్ ఇండియాకి వెళ్ళిన విషయం మనకు తెలిసిందే.
ఇండియాలో రాజమౌళిని మించిన దర్శకుడు మరొకరు లేరు అలాంటి రాజమౌళికే జేమ్స్ కామెరూన్ ఇన్స్పిరేషన్ గా నిలిచాడు అంటే ఆయన టాలెంట్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు… అవతార్ సినిమాకి ఇండియాలో సైతం గొప్ప గుర్తింపు వచ్చింది.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సైతం ‘అవుతార్’ సినిమా గురించి చాలా సంవత్సరాలపాటు మాట్లాడుకున్నారు. సినిమా పెద్దగా ఆడకపోయిన కూడా బెస్ట్ అటెంప్ట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ సినిమా ఈనెల 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఇక ఈ నేపథ్యంలో ఇండియాలో ఈ సినిమాకు పెద్దగా హైప్ రావడం లేదు. ఈ సినిమాను చూడడానికి చాలామంది ఆసక్తి చూపించకపోవడం విశేషం… ‘అవతార్ 2’ సినిమాకి ఇండియాలో భారీ బజ్ క్రియేట్ అయింది.
అది సరిగ్గా ఆడక పోవడం వల్ల ఇప్పుడు ‘అవతార్ 3’ మీద ప్రేక్షకుల్లో ఎవరికి అంత పెద్దగా ఆసక్తిగా లేనట్టుగా కనిపిస్తోంది…ఇక ఇప్పుడు రిలీజ్ అవుతున్న ‘అవతార్ 3’ సినిమా ఎలాంటి టాక్ ను సంపాదించుకుంటుంది. తద్వారా ఇండియన్ ప్రేక్షకులు ఈ సినిమాని ఎలా ఆదరిస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది…