Homeఎంటర్టైన్మెంట్Bro Movie: 'బ్రో ది అవతార్' చిత్రం లో సాయి ధరమ్ తేజ్ పాత్రని మిస్...

Bro Movie: ‘బ్రో ది అవతార్’ చిత్రం లో సాయి ధరమ్ తేజ్ పాత్రని మిస్ చేసుకున్న యంగ్ హీరో అతనేనా..? చేసి ఉంటే ఇంకా అదిరిపోయేది!

పవన్ కళ్యాణ్ - థమన్ కాంబినేషన్ అంటే కచ్చితంగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి. ఎందుకంటే గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ చిత్రాలు కమర్షియల్ గా అంత పెద్ద సక్సెస్ అవ్వడానికి కారణాలలో థమన్ అందించిన పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎంతో కీలకం. బ్రో సినిమాకి కూడా అలాగే అనుకున్నారు, పాటల విషయం లో అది జరగలేదు. కనీసం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయం లో అయినా అంచనాలను రీచ్ అవుతారో లేదో చూడాలి.

Bro Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘బ్రో ది అవతార్’ చిత్రం ఈ నెల 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ మొత్తం ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ రాగా, సాంగ్స్ కి మాత్రం చాలా మిశ్రమ స్పందన లభించింది.

పవన్ కళ్యాణ్ – థమన్ కాంబినేషన్ అంటే కచ్చితంగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి. ఎందుకంటే గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ చిత్రాలు కమర్షియల్ గా అంత పెద్ద సక్సెస్ అవ్వడానికి కారణాలలో థమన్ అందించిన పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎంతో కీలకం. బ్రో సినిమాకి కూడా అలాగే అనుకున్నారు, పాటల విషయం లో అది జరగలేదు. కనీసం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయం లో అయినా అంచనాలను రీచ్ అవుతారో లేదో చూడాలి.

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా చెయ్యాలి అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ దేవుడు క్యారక్టర్ చెయ్యాలని ఫిక్స్ అయిపోయాడు. కానీ లీడ్ రోల్ ఎవరు చెయ్యాలి అనే దానిపై చర్చలు జరగగా,త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రముఖ యంగ్ హీరో నితిన్ ని పెట్టుకుందాం అని అన్నాడట. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం నితిన్ కంటే కూడా తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ని పెట్టుకుంటే తనకి చాలా కంఫర్ట్ ఉంటుందని అన్నాడట.

ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వెంటనే సాయి ధరమ్ తేజ్ ని ఇంటికి పిలిపించిండం, సినిమా స్టోరీ చెప్పి ఓకే చేయించడం అన్నీ అలా జరిగిపోయాయి. పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అయినా నితిన్ ఈ చిత్రం చేసి ఉంటే కచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ ఉండేదని, నితిన్ కి సాయి ధరమ్ తేజ్ కంటే ఎక్కువ క్రేజ్ కనుక బిజినెస్ కి కూడా ఇంకా బాగా కలిసి వచ్చేదని అభిమానులు అంటున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper