Gharshana Movie: ఘర్షణ సినిమాను రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్ హీరో ఎవరో తెలుసా..?

ఇక దాంతో ఈ సినిమాను వెంకటేష్ తో చేయాలని గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫిక్స్ అయిపోయి వెంకటేష్ ను హీరోగా పెట్టి 'ఘర్షణ' సినిమా చేశాడు. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Written By: Gopi, Updated On : February 13, 2024 5:40 pm
Follow us on

Gharshana Movie: సినిమా ఇండస్ట్రీలో ఒకరు చేయవలసిన సినిమాలు మరొకరు చేస్తూ స్టార్ హీరోలుగా వెలుగొందిన సందర్భాలు మనం చాలా చూశాం. పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలతో రవితేజ సూపర్ సక్సెస్ లను అందుకొని ఇండస్ట్రీలోనే స్టార్ హీరోలుగా గుర్తింపు పొందుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే గౌతమ్ మీనన్ తమిళంలో చేసి ‘ఖాఖా ఖాఖి’ సినిమాకి రీమేక్ గా తెలుగులో ‘ఘర్షణ ‘ సినిమాగా చేశాడు.

అయితే తమిళంలో ఈ సినిమాలో హీరోగా సూర్య నటిస్తే తెలుగులో మాత్రం వెంకటేష్ హీరోగా చేశాడు. అయితే ఈ సినిమాను మొదట ప్రభాస్ తో తెరకెక్కిద్దమని అనుకుని గౌతమ్ మీనన్ ప్రభాస్ కి చెప్పాడు. ఇక తమిళ్ వర్షన్ చూసిన ప్రభాస్ అందులో సూర్య ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి నటనని తను మళ్లీ రిపీట్ చేయలేనేమో అనుకుని ప్రభాస్ ఈ సినిమాని రిజెక్ట్ చేశాడు.

ఇక దాంతో ఈ సినిమాను వెంకటేష్ తో చేయాలని గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫిక్స్ అయిపోయి వెంకటేష్ ను హీరోగా పెట్టి ‘ఘర్షణ’ సినిమా చేశాడు. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయినప్పటికీ ఈ సినిమా తెలుగులో కొంత మందికి నచ్చలేదు దాంతో ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఇక వెంకటేష్ చేసిన పాత్రకి మాత్రం మంచి గుర్తింపు అయితే వచ్చింది.ఇక అప్పటి నుంచి వరుసగా పోలీస్ స్టొరీ లు రావడం మొదలైంది. అలాగే గౌతమ్ మీనన్ కు కూడా తెలుగులో ఒక మంచి తెచ్చిన గుర్తింపును తీసుకువచ్చింది. ఆ తర్వాత గౌతమ్ మీనన్ తెలుగులో కూడా వరుసగా తన సినిమాలను డబ్బింగ్ చేస్తూ మంచి విజయాలను అందుకుంటూ వస్తున్నాడు.

ఇక ఇప్పుడు వెంకటేష్ కూడా తన సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ఇక ప్రభాస్ అయితే వరుసగా సినిమాలను లైన్ లో పెట్టుకొని ఒక్కో సినిమాని కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాడు…ఇక మొత్తానికైతే ప్రభాస్ ఆ సినిమాను రిజెక్ట్ చేస్తే వెంకటేష్ చేసి ఒక ఆవరేజ్ హిట్ సంపాదించుకోవడమే కాకుండా పోలీస్ క్యారెక్టర్ కి 100% న్యాయం చేసి ఆ క్యారెక్టర్ కి ప్రాణం పోశాడనే చెప్పాలి…