https://oktelugu.com/

Sarkaru Vaari Paata: సర్కారివారి పాట వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?

Sarkaru Vaari Paata: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజా చిత్రం సర్కారు వారి పాట పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ట్రిపుల్ ఆర్ రేంజ్ లో సినిమా హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నారు. దర్శకుడు పరశురాం తనదైన శైలిలో తెరకెక్కించిన చిత్రం కావడంతో బ్లాక్ బస్టర్ కావడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. టికెట్లు కూడా అదే రేంజ్ లో అమ్ముడవుుతన్నాయని చెబుతున్నారు. దీంతో సర్కారు వారి పాట మహేశ్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : May 11, 2022 / 08:55 AM IST

    Sarkaru Vaari Paata

    Follow us on

    Sarkaru Vaari Paata: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజా చిత్రం సర్కారు వారి పాట పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ట్రిపుల్ ఆర్ రేంజ్ లో సినిమా హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నారు. దర్శకుడు పరశురాం తనదైన శైలిలో తెరకెక్కించిన చిత్రం కావడంతో బ్లాక్ బస్టర్ కావడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. టికెట్లు కూడా అదే రేంజ్ లో అమ్ముడవుుతన్నాయని చెబుతున్నారు. దీంతో సర్కారు వారి పాట మహేశ్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ అవుతుందిని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

    Mahesh Babu

    దర్శకుడు పరశురాం యువత, ఆంజనేయులు, సోలో, గీతగోవిందం లాంటి చిత్రాలతో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు. దీంతో పరవురాంతో ఒక్క సినిమా అయినా చేయాలని అగ్రహీరోలు అనుకుంటుండగా సర్కారు వారి పాట సినిమా కథను మొదట బన్నీ కోసం రాసుకున్నాడట. బన్నీకి చెబితే అతడు పుష్ప సినిమాకు డేట్స్ ఇవ్వడంతో ఈ సినిమా చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా కథ మహేశ్ కు చెప్పడంతో వెంటనే ఆయన ఓకే అనడంతో సెట్ మీదకు వెళ్లింది.

    Also Read: Avatar: The Way of Water: ‘అవతార్ -2’ రిలీజ్ ఎన్ని దేశాల్లో తెలుసా..? ఇది ప్రపంచ రికార్డు

    సర్కారు వారి పాట ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేశ్ బాబు ఓ వైపు ప్రమోషన్లతో తనదైన శైలిలో ప్రచారం చేస్తూ సినిమాను హిట్ చేయాలని భావిస్తున్నారు. పరశురాం కూడా ఆసక్తికర విషయాలు మీడియాకు వెల్లడిస్తున్నారు. దీంతో సర్కారు వారి పాటపై అందరిలో ఆసక్తి రేగుతోంది. సినిమా ఏ రేంజ్ లో ఉంటుందోననే ఉత్సుకత పెరుగుతోంది. మొత్తానికి ఈ సినిమా ఓ హైపు క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు.

    Allu Arjun

    ఈ సినిమాను బన్నీ కోసం తయారు చేసినా మహేశ్ బాబుకు కలిసొచ్చింది. దీంతో అల్లు అర్జున్ ఓ బ్లాక్ బస్టర్ మూవీని మిస్సయ్యాడనే వాదనలు వస్తున్నాయి. గతంలో చాలా సినిమాలు ఒకరి కోసం రాసుకుంటే ఒకరికి దగ్గర కావడం తెలిసిందే. ఇది కూడా అంతే. ఏదిఏమైనా సర్కారు వారి పాట అంచనాలకు అందని సంచలనాలు సృష్టిస్తుందని అందరు నమ్ముతున్నా విడుదలయ్యాక తెలుస్తుంది సినిమా ఏ రేంజ్ ల ఉందనే విషయం.

    Also Read:S. V. Ranga Rao Rare Photo: ‘ఎస్వీఆర్’ చిన్ననాటి ఫోటో.. వావ్ అచ్చం ‘విజయ్ దేవరకొండ’లా ఉన్నాడు
    Recommend Videos


    Tags