IPL 2022 Play-Off Scenarios: ఐపీఎల్ లో కొత్త జట్లు అదరగొడుతున్నాయి. విజయాలతో దూసుకుపోతున్నాయి. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తమదైన శైలిలో ఆడుతూ మిగతా జట్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. పతకాల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. ప్లే ఆప్ లో చేరిన మొదటి జట్టుగా గుజరాత్ టైటాన్స్ నిలవడం విశేషం. పాయింట్ల పట్టికలో మొదటి స్థానం సంపాదించడం తెలిసిందే. దీంతో గుజరాత్ టైటాన్స్ కు ఎదురు లేకుండా పోతోంది.

మంగళవారం గుజరాత్, లక్నో మధ్య జరిగిన మ్యాచ్ లో గుజరాత్ విజయం సాధించింది. శుభ్ మన్ గిల్ అర్థ సెంచరీ ేచయడంతో 144 రులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన లక్నో 82 పరుగులకే కుప్పకూలింది. దీంతో 62 పరుగుల భారీ విజయం గుజరాత్ సొంతమైంది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో 18 పాయింట్లు సొంతం చేసుకుని తిరిగి నెంబర్ వన్ స్థానాన్ని సాధించుకుని ప్లే ఆప్స్ కు చేరిన మొదటి జట్టుగా రికార్డు సాధించింది.
Also Read: Gadapa Gadapaku YCP: గడపగడపకు వెళ్లలేం.. అధికార వైసీపీ నాయకుల్లో వణుకు..
గుజరాత్ రెండు పాయింట్లు రాబట్టుకుని రన్ రేటు కూడా మెరుగుపరుచుకుంది. లక్నో రన్ రేట్ తగ్గినా రెండ స్థానంలో కొనసాగుతోంది. లక్నో ఇంకా రెండు మ్యాచులు ఆడే అవకాశం ఉండటంతో అందులో గెలిస్తే తన స్థానం ఇంకా పుంజుకోనుంది. మే 15న రాజస్థాన్ రాయల్స్ తో మే 18న చివరి మ్యాచ్ కోల్ కత నైట్ రైడర్స్ తో ఆడనుంది.

లక్నో జట్టుకు కూడా అదృష్టం వరిస్తుందని తెలుస్తోంది. ప్లే ఆప్ చేరుకోవాలంటే రెండు మ్యాచుల్లో రెండు పాయింట్లు వస్తే చాలు. అందుకే లక్నో కూడా మంచి పొజిషన్ లో ఉందని తెలుస్తోంది. మొత్తానికి రెండు కొత్త జట్లు గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్ జట్లు విజయపథంలో దూసుకుపోతున్నాయి. పాత జట్లను కాదని కొత్త జట్లు ముందంజలోకి రావడంతో ఫ్రాంచైజీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Also Read:Jagan Sketch On Chandrababu Arrest: చంద్రబాబును జైలుకు పంపేందుకు జగన్ భారీ స్కెచ్