Hema: ఆపు నీ సుద్దపూస వేషాలు… నటి హేమ వీడియో పై జనాలు ఫైర్, ఇదేదో మూడు నెలల క్రితం చేయించాల్సింది అంటూ!

రేవ్ పార్టీ కేసులో అడ్డంగా బుక్ అయిన నటి హేమ జైలుపాలైంది. అయితే ఈ కేసులో తాను ఏ తప్పు చేయలేదంటున్న హేమ, తాజాగా ఓ వీడియో విడుదల చేసింది. ఈ వీడియో చూసిన జనాలు ఆపు నీ సుద్దపూస వేషాలు అంటూ ఎద్దేవా చేస్తున్నారు..

Written By: S Reddy, Updated On : August 21, 2024 4:53 pm

Hema

Follow us on

Hema: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పట్టుబడ్డ నటి హేమ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. హేమ డ్రగ్స్ కేసులో పోలీసులకు పట్టుబడటంతో ఆమె పేరు మీడియాలో మారుమోగింది. అయితే తాను ఎక్కడికి వెళ్లలేదని హైదరాబాద్ లోనే ఉన్నానని .. ఓ ఫార్మ్ హౌస్ లో ఛిల్ల్ అవుతున్నాను అంటూ వీడియో రిలీజ్ చేసింది. జనాన్ని బురిడీ కొట్టించే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత బెంగళూరు పోలీసులు ఆధారాలతో సహా హేమ పేరు బయటపెట్టడంతో అడ్డంగా దొరికిపోయింది.

మే 19వ తేదీ బెంగళూరులో ఓ వ్యాపారవేత్త బర్త్ డే పార్టీ నిర్వహించాడు. ఆ పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు. దాదాపు 80 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నటి హేమ పేరు వినబడటం సంచలనమైంది. హేమ పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. నార్కోటిక్ టెస్టులో హేమకు పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

ఆ తర్వాత హేమ కండిషనల్ బెయిల్ పై బయటకు వచ్చింది. అయితే తనకు ఈ డ్రగ్స్ కేసుతో ఎటువంటి సంబంధం లేదని హేమ చెబుతుంది. అసలు రేవ్ పార్టీ అంటే తనకు తెలియదు అని .. తన తమ్ముడు లాంటి వ్యక్తితో కలిసి బర్త్ డే పార్టీకి వెళ్ళాను. అనవసరంగా తనపై మీడియా వాళ్ళు తప్పుడు ప్రచారం చేశారని హేమ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తాజాగా హేమ ఓ వీడియో విడుదల చేసింది.

తాను అన్ని పరీక్షలు చేయించుకున్నానని, డ్రగ్స్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చింది అని సెల్ఫ్ క్లీన్ చిట్ ఇచ్చుకుంది. గతంలో పోలీసులు ఆమెకు పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. తాజాగా హేమ తాను ఎటువంటి డ్రగ్స్ తీసుకోలేదు. కావాలంటే రిపోర్ట్స్ చూడండి. నేను ఎటువంటి టెస్టులకైనా సిద్ధం అని హేమ ఛాలెంజ్ విసురుతుంది. నిజంగా హేమ తనను నిరూపించుకోవాలి అనుకుంటే జైలు నుంచి వచ్చిన వెంటనే టెస్టులు చేయించుకోవాలి.

మూడు నెలల తర్వాత నేను సాంప్రదాయనీ అంటూ మీడియా ముందుకు వచ్చింది. డ్రగ్స్ తీసుకుంటే గంటల వ్యవధిలో యూరిన్, బ్లడ్ టెస్ట్ ద్వారా నిర్ధారించవచ్చు. హెయిర్ ఇంకా గోళ్లు టెస్ట్ చేయడం ద్వారా రెండు నెలల తర్వాత కూడా నిర్ధారించవచ్చు. కానీ హేమ మూడు నెలలు గడిచిన తర్వాత వచ్చి తనకు ఏ పాపం తెలియదు అంటుంది. తనని ఎవరో కావాలనే ఈ కేసులో ఇరికించినట్టుగా మాట్లాడుతుంది.

పోలీసులను ఛాలెంజ్ చేసే విధంగా హేమ వ్యాఖ్యలు ఉన్నాయి. ఆమె డ్రగ్స్ తీసుకుందని పోలీసులు నిర్ధారిస్తే .. ఇప్పుడు ఎలాంటి టెస్టులకైనా రెడీ అంటూ సవాల్ చేస్తుంది. పైగా సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలుస్తాను అంటూ వీడియోలో చెప్పుకొచ్చింది. పోలీసులు ఆమెను ఏ నేరం చేయకపోయినా ఇరికించారని చెప్పే ప్రయత్నం చేస్తుంది. హేమ వ్యవహారం చూస్తుంటే ఆమెకు మరిన్ని తిప్పలు తప్పవు అనే వాదన వినిపిస్తోంది.