https://oktelugu.com/

Nagarjuna: నాగార్జున కోసం నాగేశ్వర రావు చేసింది. నాగ చైతన్య, అఖిల్ కోసం నాగార్జున చేయడం లేదా..?

నాగార్జునకి వరుసగా మంచి కాంబినేషన్లను సెట్ చేసి స్టార్ హీరోగా మార్చాడు. అయితే నాగార్జున విషయంలో నాగేశ్వరరావు తీసుకున్న చొరవ, ప్రస్తుతం నాగార్జున మాత్రం నాగచైతన్య, అఖిల్ విషయంలో తీసుకోవడం లేదు అంటూ చాలామంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : February 8, 2024 / 01:43 PM IST
    Follow us on

    Nagarjuna: నాగేశ్వరరావు ఒకప్పుడు అన్ని జానర్ల లో సినిమాలను చేస్తూ అప్పటి ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక ఎన్టీయార్ తర్వాత ఇండస్ట్రీలో ఆ రేంజ్ లో గొప్ప ఖ్యాతిని సంపాదించుకున్న అలనాటి నటుడు ఎవరైనా ఉన్నారు అంటే అది నాగేశ్వరరావు అనే చెప్పాలి. ఇక ఆయన తర్వాత ఇండస్ట్రీలో తన నట వారసత్వం కొనసాగాలనే ఉద్దేశ్యంతోనే నాగార్జునని ఇండస్ట్రీ కి హీరోగా పరిచయం చేసి ఆయనని సక్సెస్ ఫుల్ హీరో గా చేయడంలో నాగేశ్వరరావు చాలా కీలకపాత్ర వహించాడనే చెప్పాలి.

    ఇక ఇలాంటి క్రమంలోనే నాగార్జునకి వరుసగా మంచి కాంబినేషన్లను సెట్ చేసి స్టార్ హీరోగా మార్చాడు. అయితే నాగార్జున విషయంలో నాగేశ్వరరావు తీసుకున్న చొరవ, ప్రస్తుతం నాగార్జున మాత్రం నాగచైతన్య, అఖిల్ విషయంలో తీసుకోవడం లేదు అంటూ చాలామంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అప్పుడు నాగేశ్వరరావు స్క్రిప్ట్ లను చాలా పరిశీలించి మరి మంచి స్క్రిప్ట్ లు వచ్చేంతవరకు రైటర్లతో రాయించి మరి ఆ స్టోరీలతోనే నాగార్జున చేత సినిమాలు చేయించాడు.

    కానీ ఇప్పుడు నాగార్జున మాత్రం వాళ్ళ కొడుకుల విషయంలో ఇవి ఫాలో అవ్వడం లేదు. అందువల్లే వాళ్ళు సినిమాలు చేస్తున్నారు గాని, స్టార్ హీరోలుగా ఎదగలేకపోతున్నారు. ఇక చిరంజీవిని తీసుకుంటే రామ్ చరణ్ సక్సెస్ లో చాలా కీలకపాత్ర వహించాడనే చెప్పాలి. ఎలాంటి సినిమాలు చేస్తే ఆడతాయి. ఎలాంటి సినిమాలతో స్టార్ హీరో అవ్వచ్చు అనే క్యాలిక్యులేషన్స్ తో చిరంజీవి రామ్ చరణ్ ని గ్లోబల్ స్టార్ గా మార్చాడు. ఇక అదే విషయంలో నాగార్జున మాత్రం దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి మరో స్టార్ హీరో వచ్చే అవకాశాలు లేవా అనేది కూడా ఇప్పుడు చర్చకు వస్తుంది.

    ఇక ఇలాంటి క్రమంలో అఖిల్, నాగచైతన్య ఇద్దరు భారీ సక్సెస్ లను అందుకొని ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ స్థాయిని నిలబెడతారా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది…ఇక ఇప్పుడు వీళ్లిద్దరూ కూడా మంచి సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు.