Revanth Reddy and Nagarjuna : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే…ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు సత్తా చాటుకోవడమే కాకుండా వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుని పాన్ ఇండియాలో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్నారు… ఇక నాగార్జున అలాంటి స్టార్ హీరో సైతం ఎప్పుడు తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నాడు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. మొదటి నుంచి కూడా సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయడంలో అక్కినేని నాగేశ్వరరావు తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకుంటూ ఇండస్ట్రీకి కావాల్సిన సౌకర్యాలన్నింటిని సమకూర్చడంలో నాగేశ్వర రావు కీలక పాత్ర వహిస్తూ వచ్చాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు అక్కినేని ఫ్యామిలీ ఘన కీర్తిని మూట గట్టుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం హైడ్రా పేరుతో సీఎం రేవంత్ రెడ్డి నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్ హాల్ ని కులగొట్టిన విషయం మనకు తెలిసిందే. మరి ఈ విషయం మీద కొద్దిరోజుల పాటు చర్చ నడిచినప్పటికి సిఎం రేవంత్ రెడ్డికి మధ్య కొంతవరకు గ్యాప్ అయితే వచ్చింది అంటూ చాలామంది చాలా రకాల వార్తలను స్ప్రెడ్ చేశారు. మరి నిన్న జరిగిన సినిమా పెద్దల మీటింగ్ లో రేవంత్ రెడ్డి నాగార్జున కలుసుకొని మాట్లాడుకున్నారు. నిజానికి నాగార్జునకి రేవంత్ రెడ్డికి మధ్య ఎలాంటి విభేదాలు అయితే లేవు…కానీ అక్రమ నిర్మాణాల కూల్చివేతలో భాగంగా ఎన్ కన్వెన్షన్ హాల్ కొంతభాగం అక్రమ నిర్మాణంలో కట్టారనే ఉద్దేశ్యంతోనే ఆయన అలాంటి నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు నాగార్జునకి రేవంత్ రెడ్డికి మధ్య సత్సంబంధాలు అయితే నెలకొన్నట్టుగా తెలుస్తోంది.
ఇక అందులో భాగంగా నాగార్జున కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇండియా లెవెల్ కి తీసుకెళ్తున్నాం… కాబట్టి హాలీవుడ్ వాళ్ళు సైతం మన హైదరాబాదుకి వచ్చి షూట్ చేసుకునేలా దీని డెవలప్ చేయాలని అలాంటి లోకేషన్స్, స్టూడియోస్ నిర్మించాలని ఆయన సీఎం రేవంత్ రెడ్డికి సలహాలను ఇచ్చారు.
మరి రేవంత్ రెడ్డి కూడా ఆ సలహాలను పాటిస్తూ తొందరలోనే ఇండస్ట్రీని చాలా పెద్దగా వ్యాప్తి చెందేలా నిర్ణయాలు తీసుకుందామని వాళ్లకు హామీ ఇచ్చినట్టుగా వార్తలైతే వస్తున్నాయి… ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు నాగార్జున రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసిపోయి మాట్లాడుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
ఇక మీదట కూడా సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వం తరపు నుంచి సహాయ సహకారాలు అందుతాయని రేవంత్ రెడ్డి నిన్న జరిగిన మీటింగ్ లో తెలియజేశారు. ప్రజలకు ఏ ఇబ్బంది కలగనంతవరకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని రైట్స్ ని ఇస్తానని ఒకవేళ వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడితే మాత్రం కఠిన చర్యలు తీసుకోవడానికి తను సిద్ధంగా ఉంటానని చెప్పడం విశేషం…