Sai Pallavi: సాయి పల్లవికి పరిశ్రమలో సపరేట్ ఇమేజ్ ఉంది. సాయి పల్లవి అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఈ రోజుల్లో కూడా నిబంధనలు పెట్టుకుని రాణిస్తున్న ఏకైన హీరోయిన్ సాయి పల్లవి. ఆమె స్కిన్ షోకి, బోల్డ్ సన్నివేశాలకు దూరం. కథలో ప్రాధాన్యత ఉంటేనే హీరోయిన్ గా చేస్తారు. నచ్చని పాత్ర కోట్ల రూపాయలు ఇచ్చినా చేయరు. స్టార్ ఎవరన్నది నాకు ముఖ్యం కాదు. పాత్రను బట్టే సినిమాల ఎంపిక ఉంటుందని అంటారు. హీరోయిన్ గా సాయి పల్లవి ప్రస్థానం పదేళ్లు పూర్తి కావస్తోంది. చేసింది తక్కువ చిత్రాలే అయినా ఎప్పటికీ గుర్తిండిపోయే సినిమాలు చేశారు.
సాయి పల్లవి బోల్డ్ సన్నివేశాల్లో నటించరని ఆల్రెడీ అనుకున్నాము. అయితే ఒక హీరోతో మాత్రం సాయి పల్లవి లిప్ లాక్ సన్నివేశంలో నటించారు. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరీ మూవీలో నాగ చైతన్య-సాయి పల్లవి మధ్య లిప్ లాక్ సీన్ ఉంది. మరీ ఘాడమైన ముద్దు సన్నివేశం కాకపోయినా ఆ తరహా సన్నివేశంలో అయితే సాయి పల్లవి నటించారు. సాయి పల్లవి లిప్ లాక్ ఇచ్చిన ఓకె ఒక హీరో నాగ చైతన్య అన్నమాట.
శేఖర్ కమ్ముల సాయి పల్లవికి ఎవర్ గ్రీన్ హిట్స్ ఇచ్చారు. ఆయన డైరెక్షన్ లో సాయి పల్లవి నటించిన ఫిదా, లవ్ స్టోరీ మంచి విజయాలు సాధించాయి. ముఖ్యంగా ఫిదా సాయి పల్లవికి తెలుగు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఫిదాలో సాయి పల్లవి పాత్ర ప్రేక్షకులను కట్టిపడేసింది. టాలీవుడ్ లో ఆమె నిలదొక్కుకునేలా చేసింది. లవ్ స్టోరీ రూపంలో సాయి పల్లవికి శేఖర్ కమ్ముల మరో హిట్ ఇచ్చారు.
సాయి పల్లవి సినిమాలు తగ్గించారు. ఇది ఆమె అభిమానులను నిరాశ పరిచే అంశం. సాయి పల్లవి చివరి తెలుగు చిత్రం విరాటపర్వం. గార్గి టైటిల్ తో చేసిన తమిళ చిత్రం తెలుగులో కూడా విడుదల చేశారు. విరాటపర్వం విడుదలై చాలా కాలం అవుతుంది. సాయి పల్లవి మరో చిత్రానికి సైన్ చేయలేదు. ఈ క్రమంలో యాక్టింగ్ మానేసి వివాహం చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతుంది. అయితే అదేమీ లేదు. మంచి చిత్రాల కోసం ఎదురుచూస్తున్నట్టు వెల్లడించారు.