https://oktelugu.com/

Hero Suman Daughter: బుట్ట బొమ్మలాగా మెరిసిపోతున్న హీరో సుమన్ కూతురు లేటెస్ట్ ఫోటోలు చూస్తే నోరెళ్లబెడుతారు

Hero Suman Daughter: ఒక్కపుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో హీరో గా ఒక్క వెలుగు వెలిగిన నటుడు సుమన్..అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి ప్రభంజనం ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఆయనకీ పోటీ గా ఎవ్వరు నిలిచేవారు కాదు..అలాంటి స్టార్ డమ్ ని ఎంజాయ్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి కి ఊపిరి ఆడుకులేనంత పోటీ ఇచ్చిన ఏకైక హీరో సుమన్ మాత్రమే అట. .అందం మరియు నటన తో పాటు డ్యాన్స్ ,ఫైట్స్ లలో కూడా […]

Written By:
  • Vicky
  • , Updated On : April 24, 2023 / 06:13 PM IST
    Follow us on

    Hero Suman Daughter: ఒక్కపుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో హీరో గా ఒక్క వెలుగు వెలిగిన నటుడు సుమన్..అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి ప్రభంజనం ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఆయనకీ పోటీ గా ఎవ్వరు నిలిచేవారు కాదు..అలాంటి స్టార్ డమ్ ని ఎంజాయ్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి కి ఊపిరి ఆడుకులేనంత పోటీ ఇచ్చిన ఏకైక హీరో సుమన్ మాత్రమే అట. .అందం మరియు నటన తో పాటు డ్యాన్స్ ,ఫైట్స్ లలో కూడా మెగాస్టార్ చిరంజీవి కి పోటీ ఇచ్చేవాడు ఆయన..కానీ బ్యాడ్ లక్ తో కొన్ని కారణాల వల్ల జైలుపాలై కెరీర్ మొత్తం ని సర్వ నాశనం చేసుకున్నాడు..జైలు నుండి విడుదల అయినా తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా నటించిన బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు..ఇక హీరోగా తన పని అయిపోయింది అని అర్థం చేసుకున్న సుమన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఆయన మంచి పేరు సంపాదించారు..ఇక రజినీకాంత్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన శివాజీ సినిమాతో విలన్ గా పరిచయం అయ్యాడు..ఆ సినిమాలో ఆయన చూపించిన నటన ఇప్పటికి ఎవ్వరు మర్చిపోలేరు..ఆ సినిమా తర్వాత ఆయన పలు సినిమాల్లో విలన్ పాత్రలు చేసి అద్భుతంగా రాణించాడు.

    Hero Suman Daughter

    ఇక ఆయన వైవాహిక జీవితాతం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే తెలుసు లో సీనియర్ రచయితా అయినా డీ వీ నరసరాజు మనవరాలు అయినా శిరీష తల్వార్ ని వివాహం చేసుకున్నాడు సుమన్ ..వీరిద్దరికి ఒక్క కుమార్తె కూడా ఉంది..ఆమె పేరు అఖిలజ ప్రత్యూక్ష..ఈమె ఒక్క గొప్ప నృత్య కళాకారిణి అని చెప్పొచ్చు..ఈమె అందం ముందు మన టాలీవుడ్ హీరోయిన్లు ఎవ్వరు కూడా సరి తూగరు అనడం లో ఎలాంటి సందేహం లేదు..రవీంద్ర భారతి వంటి కళా క్షేత్తం లో ఎన్నో డాన్స్ పోటీలలో పాల్గొని లెక్కలేనన్ని అవార్డులను కైవసం చేసుకుంది..సినిమాలలో నటించాల్సిందిగా ఎంతో మంది ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు సుమన్ ని ఎంతో రిక్వెస్ట్ చెయ్యగా ఆయన దానికి ససేమిరా ఒప్పుకోలేదట..ప్రత్యూక్ష కూడా సినిమాలంటే ఎలాంటి ఆసక్తి లేకపోవడం తో ఈమెని వెండితెర పై చూడలేకపొయ్యాం..ఇది ఇలా ఉండగా ఆమె నృత్య ప్రదర్శన ఇచ్చిన కొన్ని ఫోటోలు మీరు క్రింద చూడవచ్చు.

    Hero Suman Daughter

    ఇక సుమన్ విషయానికి వస్తే ప్రస్తుతం సౌత్ ఇండియా లో ఎంత మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు తెలుగు సినిమాలో పుట్టుకొని వస్తున్నా కూడా సుమన్ డిమాండ్ ఏమాత్రం తగ్గలేదనే..దక్షిణ భారతదేశం లో ప్రతి భాషలోనూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ఇప్పటికి ఊపిరి సలపనంతా బిజీ గా ఉన్నాడు ఆయన..అంతే కాకుండా సుమన్ కి కరాటే లో మంచి ప్రావిణ్యం ఉంది..అప్పట్లో ఆయన హీరోగా చేస్తున్న కాలం లో స్వయంగా ఆయనే తన ఫైట్స్ ని కంపోజ్ చేసుకునే వారట..తనకి తెలిసిన ఆ విద్యని అందరికి నేర్పించాలి అనే గొప్ప ఉదేశ్యం తో రెండు తెలుగు రాష్ట్రాలలో కరాటే స్కూల్స్ ని కూడా పెట్టాడు..ఔత్సాహికులకు ఎందరికో ఈయన ఉచితంగా కూడా కరాటే నేర్పించాడు..అంతేకాకుండా ఆపద లో ఉన్న ఎంతో మంది సినీ కార్మికులకు కూడా ఉపాధి మార్గం చూపించిన గొప్ప మనసు సుమన్ కి ఉంది..ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్న సుమన్ భవిష్యతులో కూడా ఆయన ఇంకా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం.