https://oktelugu.com/

Star Heroine: ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో తెలుసా..? ఒక్క యాక్సిడెంట్ తో ఖాళీగా మారిపోయిన స్టార్ హీరోయిన్…

పూరీతో చేసిన సినిమా సూపర్ సక్సెస్ అయినప్పటికీ, ఆ తర్వాత చేసిన సినిమాలు ఆమెకి మంచి పేరు అయితే తీసుకురాలేకపోయాయి. ఇక దానికి తోడుగా ఆమెకి యాక్సిడెంట్ జరగడం వల్ల...

Written By:
  • Gopi
  • , Updated On : April 6, 2024 / 03:12 PM IST

    Nabha Natesh childhood pics

    Follow us on

    Star Heroine:  సినిమా ఇండస్ట్రీలో హీరో అయిన హీరోయిన్ అయిన సినిమాలు చేసినంత వరకే వాళ్లకు గుర్తింపు ఉంటుంది. అలాగే ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా భారీ స్థాయిలో పెరుగుతుంది. ఒకవేళ సినిమాల నుంచి బయటికి వచ్చిన లేదంటే కొద్ది రోజుల పాటు సినిమాలు చేయకపోయిన వాళ్లని ప్రేక్షకులు మర్చిపోతూ ఉంటారు. ఇక ప్రస్తుతం ఒక హీరోయిన్ పరిస్థితి కూడా ఇలాగే మారిపోయింది. పూరి జగన్నాధ్ లాంటి స్టార్ డైరెక్టర్ తో సినిమా చేసిన కూడా ఆమెకు అదృష్టం ఎంత మాత్రం కలిసి రాలేదు.

    అయితే పూరీతో చేసిన సినిమా సూపర్ సక్సెస్ అయినప్పటికీ, ఆ తర్వాత చేసిన సినిమాలు ఆమెకి మంచి పేరు అయితే తీసుకురాలేకపోయాయి. ఇక దానికి తోడుగా ఆమెకి యాక్సిడెంట్ జరగడం వల్ల కంప్లీట్ గా ఆమె ఒక రెండు సంవత్సరాల పాటు రెస్ట్ తీసుకొని మళ్ళీ సినిమాల్లోకి అడుగు పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు వరుస విజయాలను అందుకోవడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఆమె చిన్నప్పటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆమె ఎవరు అంటే ‘నభా నటేష్’..ఈమె ‘నన్ను దోచుకుందువటే’ అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ, 2019లో రామ్ హీరోగా పూరీ డైరెక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తను మంచి పాపులారిటీని సంపాదించుకుంది.

    ఈ సినిమా సక్సెస్ సాధించడంతో ఆ తర్వాత డిస్కో రాజా, సోలో బతికే సో బెటర్ లాంటి సినిమాల్లో నటించినప్పటికీ ఆమెకి అనుకున్న సక్సెస్ అయితే దక్కలేదు. ఇక దానికి తోడుగా మధ్యలో ఆమెకు ఆక్సిడెంట్ జరగడం వల్ల చాలా రోజులపాటు ఇండస్ట్రీ నుంచి బ్రేక్ అయితే తీసుకుంది. ఇక ప్రస్తుతం ‘నిఖిల్ సిద్దార్థ్’ హీరోగా వస్తున్న పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘స్వయంభు ‘ అనే సినిమాలో నటిస్తున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక దానికి సంబంధించిన ఒక ఫోటోని కూడా ఆమె ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఇక ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది… ఇక ఇప్పటికైనా ఈ సినిమాతో భారీ సక్సెస్ ని కొట్టి మరిన్ని ఆఫర్లను తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది…