https://oktelugu.com/

Mega Star: మన హీరోలకు మెగాస్టార్, ఐకాన్ స్టార్ అనే బిరుదులు ఎవరు ఇచ్చారు ఎందుకు ఇచ్చారో తెలుసా..?

1960 వ సంవత్సరానికి ముందు దర్శకుడు హీరోలు అంతా ఒకటిగా కలిసి పని చేస్తూ సినిమాలని రిలీజ్ చేస్తూ ఉండేవారు. ఇక హీరో దర్శకుడు అనే భేదాలు లేకుండా అందరూ కలిసి పని చేసుకుంటూ ముందుకెళ్లేవారు.

Written By:
  • Gopi
  • , Updated On : May 8, 2024 / 04:29 PM IST

    Do you know who gave the titles Megastar and Icon Star to our heroes

    Follow us on

    Mega Star: ఒక సినిమా థియేటర్లోకి వస్తుంది అంటే ఆ సినిమాలో హీరో ఎవరు అనే దానిని బేస్ చేసుకొనే ప్రేక్షకుడు సినిమా థియేటర్ కి వచ్చి సినిమా చూడడానికి ఆసక్తిని చూపిస్తూ ఉంటాడు. అందుకే స్టార్ హీరోల సినిమాకి కలెక్షన్స్ ఒక విధంగా వస్తుంటే యంగ్ హీరోల సినిమాకి కలెక్షన్స్ మరొక విధంగా వస్తూ ఉంటాయి. అలాగే వాళ్ళ కలెక్షన్స్ ని బేస్ చేసుకొని వాళ్ళ రెమ్యూనరేషన్స్ కూడా ఫిక్స్ చేస్తూ ఉంటారు. ఇలా ఒక సినిమా సక్సెస్ అవ్వాలన్న ఫెయిల్యూర్ అవ్వాలన్న అది హీరో మీద బేస్ అయ్యే ఉంటుంది.ఇక ఇదిలా ఉంటే మన స్టార్ హీరోలందరి పేర్ల చివరన సూపర్ స్టార్, మెగాస్టార్ అంటూ కొన్ని బిరుదులైతే వచ్చి చేరాయి. అయితే వీటిని ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    1960 వ సంవత్సరానికి ముందు దర్శకుడు హీరోలు అంతా ఒకటిగా కలిసి పని చేస్తూ సినిమాలని రిలీజ్ చేస్తూ ఉండేవారు. ఇక హీరో దర్శకుడు అనే భేదాలు లేకుండా అందరూ కలిసి పని చేసుకుంటూ ముందుకెళ్లేవారు. ఇక 1960 వ సంవత్సరం తర్వాత నుంచి సినిమాకి హీరో నే పిల్లర్ అనే విధంగా హీరోలు ఒక క్రేజ్ అయితే సంపాదించుకున్నారు. ఇక అప్పటినుంచి హీరో కి ఏదో ఒక బిరుదు అయితే దర్శక నిర్మాతలు ఇస్తు వాళ్లను ముందుకు ప్రమోట్ చేస్తూ వచ్చారు. వాళ్లని చూడడానికి ప్రేక్షకులు సినిమాకి వస్తున్నారు కాబట్టి వాళ్ళని స్టార్లుగా ఒక గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దే క్రమంలోనే ఈ బిరుదులు అనేవి వచ్చి చేరాయి…

    ఇక చిరంజీవి ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో సుప్రీం హీరో అనే బిరుదు ను సంపాదించుకున్నారు. కానీ ఆయన స్టాండర్డ్ ని మరింత పెంచే క్రమం లో ఆయన చేసిన ‘మరణ మృదంగం’ సినిమా సమయంలో డైరెక్టర్ కోదండరామిరెడ్డి స్క్రీన్ మీద ‘మెగాస్టార్ చిరంజీవి’ అని మొదటిసారిగా తన పేరు ముందు ఈ బిరుదు తగిలించారు. ఇక దాంతో అప్పటినుంచి చిరంజీవి మెగాస్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఆర్య సినిమాతో ‘స్టైలిష్ స్టార్’ గా ఒక బిరుదును సంపాదించుకున్న అల్లు అర్జున్…

    రీసెంట్ గా పుష్ప సినిమా తో పాన్ ఇండియా సినిమాను చేశాడు. కాబట్టి పాన్ ఇండియాలో స్టైలిష్ స్టార్ అనే బిరుదు సరిపోదనే ఉద్దేశ్యం తో ఆ సినిమా దర్శకుడు అయిన సుకుమార్ స్క్రీన్ మీద ‘ఐకాన్ స్టార్’గా తన పేరును వేయించాడు. ఇక దాంతో ప్రస్తుతం ఐకాన్ స్టార్ గా అల్లు అర్జున్ పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ను సాధిస్తూ మంచి క్రేజ్ ను కూడా సంపాదించుకుంటున్నాడు… ఇలా ప్రతి ఒక్క హీరోకి ప్రతి ఒక్క బిరుదు అన్నది వాళ్ల స్టార్ డమ్ ను రిప్రెజెంట్ చేసుకోవడానికి మాత్రమే దర్శక నిర్మాతలు పెట్టారు తప్ప దానికి ప్రత్యేకించి స్టోరీలు అనేవి ఏమి లేవు…