https://oktelugu.com/

Sam Pitroda: పిట్రోడానా.. పిచ్చోడా.. దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లా.. మరో వివాదంలో కాంగ్రెస్‌ నేత!

ది స్టేట్స్‌మన్‌ పత్రికకు ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో భారత్‌ ప్రజాస్వామ్యం, భిన్నత్వం గురించి ఆయన మాట్లాడారు. లౌకిక దేశాన్ని సాధించడం కోసం మన స్వాతంత్య్ర సమరయోధులు బ్రిటిషర్లతో పోరాడారని తెలిపారు.

Written By: , Updated On : May 8, 2024 / 04:26 PM IST
Sam Pitroda

Sam Pitroda

Follow us on

Sam Pitroda: లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శామ్‌ పిట్రోడా మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే వారసత్వ పన్ను గురించి ప్రస్తావించి కాంగ్రెస్‌ పార్టీకి లేని తలనొప్ప తెచ్చాడు. అది సద్దుమణగకుముందే మరోమారు అంతకు మించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. భారత్‌ను విభిన్న దేశంగా అభివర్ణించే క్రమంలో ఆయన చెప్పిన పోలిక వివాదాస్పదమైంది. దీనిపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగునుబట్టి మనుషులను పోల్చడం ఏంటని మండిపడ్డారు. ఊరుకునేది లేదని హెచ్చరించారు.

పిట్రోడా ఏమన్నాడు..
ది స్టేట్స్‌మన్‌ పత్రికకు ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో భారత్‌ ప్రజాస్వామ్యం, భిన్నత్వం గురించి ఆయన మాట్లాడారు. లౌకిక దేశాన్ని సాధించడం కోసం మన స్వాతంత్య్ర సమరయోధులు బ్రిటిషర్లతో పోరాడారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి మన దేశమే ఉత్తమ నిరదర్శనమని పేర్కొన్నారు. మనది వైవిధ్యమైన దేశమని, తూర్పున ఉన్న ప్రజలు చైనీయుల్లా.. పశ్చిమాన ఉన్నవారు అరబ్బుల్లా కనిపిస్తారన్నారు. ఇక ఉత్తరాదిన ఉన్నవారు శ్వేతజాతీయులుగా, దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా ఉంటారని తెలిపారు. ఇవన్నీ ఎలా ఉన్నా.. అందరం సోదర సోదరీమణులమే అని, భాషలు, మతాలు, సంప్రదాయాలు, ఆహార అలవాట్లు పరస్పరం గౌరవించుకుంటాం అని వెల్లడించారు. ప్రజాస్వామ్యం స్వేచ్ఛ, సమానత్వం సౌభ్రాతృత్వం మన మూలాల్లో పాతుకుపోయాయి అని తెలిపారు.

మండిపడిన బీజేపీ..
అయతే భారతీయుల రూపురేఖలపై శామ్‌ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు తాజా వివాదానికి తెరలేపాయి. దీనిపై అసోం సీఎం హిమంత విశ్వశర్మ స్పందిస్తూ తాను ఈశాన్య భారతానికి చెందిన వ్యక్తిని, కానీ భారతీయుడిలా కన్పిస్తా.. వైవిధ్య భారతావనిలో మనం భిన్నంగా కన్నించినా మనమంతా ఒక్కటే అని తెలిపారు. మన దేశం గురించి కనీస జ్ఞానం తెలుసుకోండి అని వ్యంగ్యంగా పిట్రోడాకు సూచన చేశారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి, సినీ నటి కంగనారనౌత్‌ స్పందిస్తూ.. శామ్‌ పిట్ర6డా రాహుల్‌గాంధీ మెంటర్‌. భారతీయుపై ఆయన ఎలాంటి వివక్షపూరిత వ్యాఖ్యలు చేశారో గమనించాలని పేర్కొన్నారు. విభజించు.. పాలించు అనేది కాంగ్రెస్‌ సిద్ధాంతమని మండిపడ్డారు.

ఇటీవల వారసత్వ పన్నుపై..
పిట్రోడా ఇటీవల వారసత్వ పన్ను గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో వారసత్వ పన్ను ఉంది. దాని ప్రకారం.. ఒక వ్యక్తి దగ్గర 100 మిలియన్‌ డాలర్లు ఉంటే.. ఆ వ్యక్తి మరణానంతరం అందులో సుమారు 45 శాతం మాత్రమే వారసులకు బదిలీ అవుతుంది. మిగిలిన 55 శాతం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అదొక ఆసక్తికరమైన అంశం. ఇది న్యాయంగానే ఉంది అని పేర్కొన్నారు. దీనిపై విమర్శలు రావడంతో కాంగ్రెస్‌ స్పందించింది. అదంతా పిట్రోడా వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొన్నారు. తాజాగా చర్మం రంగు ఆధారంగా దేశ ప్రజలను విభజించడం మరింత వివాదాస్పదమైంది.