Chiranjeevi Birthday: బాలయ్యకు నచ్చిన చిరంజీవి మూవీ ఏంటో తెలుసా? ఆశ్చర్యపోతారు!

చిరంజీవి, బాలకృష్ణ సమకాలీన నటులు. వీరి మధ్య దశాబ్దాలుగా పోటీ నడుస్తోంది. బాలకృష్ణ-చిరంజీవి బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే ఫైట్ ఆసక్తికరంగా ఉంటుంది. అయితే చిరంజీవి నటించిన ఓ చిత్రం అంటే బాలకృష్ణకు చాలా ఇష్టం అట.

Written By: S Reddy, Updated On : August 22, 2024 10:00 am

Chiranjeevi Birthday(1)

Follow us on

Chiranjeevi Birthday: మెగాస్టార్ చిరంజీవి జన్మదినం నేడు. 1955 ఆగస్టు 22న పుట్టిన చిరంజీవి 69వ ఏట అడుగుపెడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిరంజీవి అభిమానులు వేడుకలు జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి అభిమానులు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అభిమానుల కోసం చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ ఇంద్ర రీరిలీజ్ చేశారు. ఇంద్రసేనారెడ్డిగా చిరంజీవి మరోసారి సిల్వర్ స్క్రీన్ కి షేక్ చేయనున్నాడు.

అలాగే చిరంజీవి లేటెస్ట్ మూవీ విశ్వంభర నుంచి అప్డేట్ రానుందని సమాచారం. బింబిసార ఫేమ్ వశిష్ట ఈ చిత్రానికి దర్శకుడు. సోషియో ఫాంటసీ చిత్రం రూపొందిస్తున్నారు . విశ్వంభర 2025 సంక్రాంతి కానుకగా విడుదల కానుందని సమాచారం. చిరంజీవికి జంటగా త్రిష నటిస్తుంది. విశ్వంభర చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇక చిరంజీవి బర్త్ డే నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చిరంజీవి సమకాలీన నటుడు బాలకృష్ణకు ఆయన నటించిన ఓ చిత్రం అంటే మహా ఇష్టం అట. దర్శకుడు కే రాఘవేంద్రరావు-చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి బాలకృష్ణ ఆల్ టైం ఫేవరేట్ మూవీ అట. ఈ చిత్రాన్ని ఆయన బాగా ఎంజాయ్ చేస్తాడట. ఈ విషయాన్ని బాలకృష్ణ గతంలో ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పాడు.

1990లో సోషియో ఫాంటసీ మూవీగా విడుదలైన జగదేకవీరుడు అతిలోక సుందరి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. మానవుడిని ప్రేమించే దేవకన్య కథగా ఈ చిత్రం తెరకెక్కింది. దేవకన్య పాత్రలో శ్రీదేవి అద్భుతం చేసింది. చిరంజీవి మాస్ మేనరిజమ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్. ఇళయరాజా సాంగ్స్ ఇప్పటికీ పాప్యులర్. వందల రోజులు జగదేకవీరుడు అతిలోక సుందరి నాన్ స్టాప్ గా థియేటర్స్లో ప్రదర్శించారు.

అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ రికార్డ్స్ ని జగదేకవీరుడు అతిలోకసుందరి బ్రేక్ చేసింది. చిరంజీవి ఇమేజ్ ని మరో స్థాయికి తీసుకెళ్లింది. జానపద, సోషియో ఫాంటసీ చిత్రాలు ఇష్టపడే బాలయ్యకు జగదేకవీరుడు అతిలోకసుందరి తెగ నచ్చేసిందట. సాధారణంగా బాలకృష్ణ ఇతర హీరోలను, వారి చిత్రాలను పొగడరు. నాన్న ఎన్టీఆర్ గురించి మాత్రమే మాట్లాడతారు. చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రం మాత్రం నచ్చిందని ఆయన ఓ సందర్భంలో తెలిపారు.

కాగా అదే ఏడాది బాలకృష్ణ నాలుగు సినిమాలు విడుదల చేశాడు. బాలకృష్ణ 5వ చిత్రంగా నారీ నారీ నడుమ మురారీ విడుదలైంది. ఈ చిత్రం క్లాసిక్ హిట్. కేవీ మహదేవన్ సాంగ్స్ మెస్మరైజ్ చేస్తాయి. ఈ మూవీలోని ప్రతి పాట ఒక ఆణిముత్యం. అలాగే లారీ డ్రైవర్ తో మరో హిట్ కొట్టాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన లారీ డ్రైవర్ మంచి విజయం అందుకుంది. జగదేక వీరుడు అతిలోక సుందరి ఆ ఏడాదికి అతి పెద్ద హిట్ గా ఉంది.