https://oktelugu.com/

RRR sequel : త్రిబుల్ ఆర్ సినిమాకి సిక్వెల్ వచ్చేది ఎప్పుడో తెలుసా..?

ఇక ఇప్పుడు మహేష్ బాబు తో చేస్తున్న సినిమా తర్వాత ఈ సినిమాని పాన్ వరల్డ్ లో చేయాలనే ఉద్దేశ్యం లో రాజమౌళి ఉన్నాడట...అయితే ఈ సీక్వెల్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఉంటారా లేదంటే వేరే హీరోలతో చేస్తారా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది...

Written By:
  • NARESH
  • , Updated On : May 6, 2024 / 12:19 PM IST

    RRR sequel

    Follow us on

    RRR sequel : ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సీక్వెల్స్ హవా ఎక్కువగా నడుస్తుంది. ప్రతి సినిమాకి సీక్వెల్ ను తీస్తూ ప్రేక్షకులను మెప్పించడంలో దర్శకులు చాలా వరకు సక్సెస్ అవుతున్నారనే చెప్పాలి. ఇక అందులో భాగంగానే ఇప్పటికే దర్శకులు ఒక సినిమా సక్సెస్ అయ్యిందంటే దానికి సీక్వెల్ ను ప్లాన్ చేసుకుంటూ ముందుకు కదులుతున్నారు.

    ఫ్రెష్ స్టోరీ తో వచ్చే దానికంటే సీక్వెల్ సినిమాలు చేస్తే దాని మీద ముందు నుంచే చాలా మంచి అంచనాలు ఉంటాయి. కాబట్టి ఆ అంచనాలను క్యాష్ చేసుకునే విధంగానే దర్శకులు ముందుకు అడుగులు వేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు హీరోలుగా వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. అయితే ఈ సినిమాకి సీక్వెల్ వస్తుంది అంటూ చాలా రోజుల నుంచి చాలా రకాల చర్చలు అయితే జరుగుతున్నాయి.

    ఇక ఈ సినిమా రైటర్ అయిన విజయేంద్రప్రసాద్ కూడా పలు సందర్భాల్లో ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందంటూ చాలా హింట్స్ అయితే ఇచ్చారు. ఇక దాంతో ఎప్పటికప్పుడు ఈ న్యూస్ తెరపైకి వస్తుందే తప్ప దీని మీద ఎవరు అంతా పకడ్బందీగా క్లారిటీ అయితే ఇవ్వడం లేదు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా సీక్వెల్ ని కూడా రాజమౌళి తీయాలనే ప్లాన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎందుకు ఆయన ఈ సినిమాని చేయబోతున్నాడు అంటే ఆయన త్రిబుల్ ఆర్ సినిమాలో చాలా వరకు మిస్టేక్స్ చేశారని తనే ఒక ఇంటర్వ్యూలో ఒప్పుకున్నాడు.

    కాబట్టి వాటిని రెక్టిఫై చేసి ఇప్పుడు చేయబోయే త్రిబుల్ ఆర్ సినిమాకి సీక్వెల్ని చాలా గ్రాండ్ గా తీయాలని తను అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు మహేష్ బాబు తో చేస్తున్న సినిమా తర్వాత ఈ సినిమాని పాన్ వరల్డ్ లో చేయాలనే ఉద్దేశ్యం లో రాజమౌళి ఉన్నాడట…అయితే ఈ సీక్వెల్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఉంటారా లేదంటే వేరే హీరోలతో చేస్తారా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది…