https://oktelugu.com/

Pushpa 2 : పుష్ప 2 లో క్యామియో రోల్స్ ప్లే చేస్తున్న స్టార్ హీరోలు వీళ్లేనా..?

అల్లు అర్జున్ లాంటి హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉండటం మన అదృష్టం అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ తెలుగు హీరోకి సాధ్యం కానీ 'నేషనల్ అవార్డు' ను తను అందుకున్నాడు

Written By:
  • Gopi
  • , Updated On : July 24, 2024 / 10:07 PM IST
    Follow us on

    Pushpa 2  : తెలుగు సినిమా ఇండస్ట్రీకి గంగోత్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ఆ సినిమాతోనే సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు. అయితే మొదటి సినిమా సక్సెస్ అయితే అయింది. కానీ ఆ సినిమా వల్ల ఆయనకు వచ్చిన లాభం అయితే ఏమీ లేదు. ఎందుకంటే ఆ సినిమాలో హీరోగా చేసిన కూడా అది డీ గ్లామర్ రోల్ అందులోనూ ఒక టీనేజీ లవ్ స్టోరీ సినిమా కావడం కూడా దానికి కారణమనే చెప్పాలి. ఇక మొత్తానికైతే ఆ తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో చేసిన ఆర్య సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వెనుతిరిగి చూడకుండా వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో ఒక మంచి హీరోగా ఎదగడమే కాకుండా స్టైలిష్ స్టార్ గా కూడా తనకంటూ ఒక పేరుని సంపాదించుకున్నాడు. ఇక యూత్ లో తనదైన రీతిలో మంచి ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకొని అప్పటినుంచి ఇప్పటివరకు కష్టపడుతూ ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ వచ్చాడు. ఇక పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా మారిన ఆయన ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా దర్శకుడు అయిన సుకుమార్ సినిమాని సూపర్ సక్సెస్ చేస్తానని అల్లు అర్జున్ కి మాటిచ్చినట్టుగా తెలుస్తుంది.

    ఇక అందులో భాగంగానే సినిమా షూటింగ్ తొందర తొందరగా పూర్తి చేసి సినిమా రిజల్ట్ ని నెగిటివ్ గా తీసుకురావడం ఇష్టం లేదట. అందుకే సినిమా షూటింగ్ ను నిదానంగా చేసి సినిమా లేటుగా వచ్చిన కూడా ఒక బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టే విధంగా మార్చాలనే ఉద్దేశ్యంతోనే ఆగస్టు 15 కు రావాల్సిన ఈ సినిమాని డిసెంబర్ 6వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు. ఇక సుకుమార్ కూడా తనదైన రీతిలో ఈ సినిమా మీద పూర్తి ఎఫర్ట్ పెట్టి ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా అద్భుతంగా వస్తుందట. ఇక రిలీజ్ సమయానికి సినిమా మీద భారీ హైప్ ని క్రియేట్ చేయాలని చూస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో రెండు క్యామియో రోల్స్ ఉన్నాయట. ఆ క్యారెక్టర్లను ఎవరు పోషిస్తున్నారు అనే విషయం మీద ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. అయితే ఒక క్యామియో రోల్ లో బాలీవుడ్ స్టార్ హీరో అయిన రన్వీర్ సింగ్ కనిపిస్తుండగా, మరొక క్యారెక్టర్ లో తమిళ స్టార్ హీరో అయిన సూర్య నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక సినిమా యూనిట్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఇక నిజంగానే వీళ్ళిద్దరు ఈ సినిమాలో నటిస్తున్నారా? లేదా వేరే వాళ్ళు నటిస్తున్నారా? అనే విషయం మీద సినిమా యూనిట్ అయితే ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

    క్యామియో రోల్స్ అంటే సినిమా థియేటర్ లో మూవీ చూసే ప్రేక్షకులు సర్ప్రైజ్ అవ్వడానికి వాటిని సినిమాలోకి తీసుకువస్తారు. కాబట్టి దానిమీద సినిమా యూనిట్ అయితే క్లారిటీ ఇవ్వడం లేదు. ఇక మొత్తానికైతే పుష్ప 2 సినిమా ఒక భారీ సక్సెస్ ని సాధించడానికి సర్వం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఈ సినిమా సూపర్ హిట్ అయితే అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా లో స్టార్ హీరోగా మారుతాడు..