Balakrishna-Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న హీరో బాలకృష్ణ…ఈయన చేసిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకొని విపరీతమైన అంచనాలను క్రియేట్ చేసుకుంటూ ఉంటాయి. ఇక అందుకు తగ్గట్టుగానే ఆయన చేసిన మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు కూడా ఆయన స్టార్ హీరోగా తన ప్రస్థానాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొనసాగిస్తూ వస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగులోనే కాకుండా ప్రస్తుతం పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందుతున్న దర్శకుడు రాజమౌళి…
ఈయన చేస్తున్న సినిమాలు కూడా ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఇక ఇప్పటివరకు ఈయన చేసిన సినిమాలు వరుస సక్సెస్ లను అందుకుంటు వచ్చాయి. ప్రస్తుతం ఆయన మహేష్ బాబుని హీరోగా పెట్టి పాన్ వరల్డ్ లో ఒక భారీ సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి బాలయ్య బాబుతో రెండు సినిమాలను తెరకెక్కించాలనే ప్రయత్నం చేశాడు. కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమాలు రెండూ సార్లు పట్టాలెక్కలేదు. అయితే నిజానికి రాజమౌళి ఎన్టీఆర్ తో చేసిన ‘సింహాద్రి ‘ సినిమాని మొదట బాలకృష్ణ తో చేయాలని ప్రయత్నం చేశాడు.
అయినప్పటికీ ఆ స్టోరీ ని రిజెక్ట్ చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్టీఆర్ తో ఈ సినిమా చేయాల్సి వచ్చింది. ఇక దాంతో పాటుగా విక్రమార్కుడు సినిమా స్టోరీని కూడా బాలయ్య బాబుతో చేయాలని రాజమౌళి ప్లాన్ చేసినట్టుగా అప్పట్లో వార్తలైతే వచ్చాయి. ఇక ఈ సినిమాను మొదట గా పవన్ కళ్యాణ్ తో చేయాలనుకున్నప్పటికీ ఆయన కొన్ని కారణాల వల్ల ఈ సబ్జెక్ట్ ను రిజెక్ట్ చేయడంతో, రాజమౌళి బాలయ్య బాబుతో ఈ సినిమా చేయాలనే ప్రయత్నం చేశాడట. అయినప్పటికీ కొన్ని పరిస్థితుల వల్ల ఈ సినిమాని బాలయ్య బాబు మిస్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది.
ఇక మొత్తానికైతే ఈ సినిమాతో రవితేజ ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడనే చెప్పాలి. ఇక మొత్తానికైతే రాజమౌళి డైరెక్షన్ లో బాలయ్య బాబు చేయాల్సిన రెండు సినిమాలను చేజేతులారా తనే మిస్ చేసుకోవడం అనేది నిజంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి…