SBI: మీరు ఎస్‌బీఐ కార్డులు వాడుతున్నారా.. దారుణంగా చార్జీల పెంపు..

మీరు క్లాసిక్, సిల్వర్, కాంటాక్ట్‌లెస్‌ డెబిట్‌ కార్డులు వినియోగిస్తున్నట్లు అయితే వాటి వార్షిక మెయిటనెన్స్‌ చార్జీ125 + జీఎస్టీ నుంచి ఏకంగా 200 + జీఎస్టీకి పెంచేసింది. వీటితోపాటు..

Written By: Raj Shekar, Updated On : April 5, 2024 4:47 pm

SBI hikes annual maintenance charges

Follow us on

SBI:  మీరు ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్‌ కార్డులు వినియోగిస్తున్నారా.. అయితే మీకు ఓ షాకింగ్‌ న్యూస్‌. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఎస్‌బీఐ కొత్త రూల్స్‌ అమలులోకి తెచ్చింది. వివిధ కార్డుల సర్వీస్‌ చార్జీలను భారీగా పెంచేసింది. మీరు క్లాసిక్, సిల్వర్, కాంటాక్ట్‌లెస్‌ డెబిట్‌ కార్డులు వినియోగిస్తున్నట్లు అయితే వాటి వార్షిక మెయిటనెన్స్‌ చార్జీ125 + జీఎస్టీ నుంచి ఏకంగా 200 + జీఎస్టీకి పెంచేసింది. వీటితోపాటు..

= యువ, గోల్డ్, కాంబో డెబిట్‌ కార్డులు వినియోగిస్తే.. వీటిపై ప్రస్తుతం వార్షిక మెయిటనెన్స్‌ చార్జి రూ.175 + జీఎస్టీ నుంచి రూ.250 + జీఎస్టీకి పెంచింది.

= ఇక ప్లాడినం డెబిట్‌ కార్డు వార్షిక సర్వీస్‌ చార్జీని రూ.250+జీఎస్టీ నుంచి రూ.325+జీఎస్టీకి పెంచేసింది.

= ప్రైడ్‌ లేదా ప్రీమియం బిజినెస్‌ డెబిట్‌ కార్డు వార్షిక సర్వీస్‌ రూ.350+ జీఎస్టీ నుంచి ఏకంగా రూ.425+ జీఎస్టీకి పెంచింది.

రివార్డు పాయింట్లు ఎత్తివేత..
ఇంతే కాకుండా ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డును వినియోగిస్తే ఇంతకాలం ఆకార్డుతో ఇంటి అద్దె కట్టినట్లయితే రివార్డు పాయింట్లు వచ్చేవి. ఏప్రిల్‌ 1 నుంచి ఈ రివార్డు పాయింట్లను కూడా ఎస్‌బీఐ ఎత్తేసింది.

మొత్తంగా 2024–25 కొత్త వార్షిక సంవత్సం నుంచి ఎస్‌బీఐ వినియోగదారులకు షాక్‌ ఇచ్చిందనే చెప్పుకోవాలి. అందరి వద్ద ఏదో ఒక రకమైన కార్డు ఉన్నందున అందరిపైనా ఎంతో కొంత భారం పడడం ఖాయం.