NTR-Ram Charan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఎన్టీఆర్, నాగేశ్వరరావు ఇద్దరూ చాలా సినిమాల్లో కలిసి నటించి మంచి గుర్తింపు ను సంపాదించుకున్నారు. ఇక వీళ్లిద్దరూ ఇండస్ట్రీకి చేసిన సేవకు గాను వీళ్ళని ఇండస్ట్రీకి రెండు కండ్లు గా చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి క్రమంలోనే వీళ్ళు సాధించిన విజయాలు గానీ, వీళ్ళు చేసిన పాత్రలు గానీ ఎప్పటికీ చిరస్మరణీయంగా గుర్తుండిపోతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక వీళ్ళ తర్వాత జనరేషన్ లో మల్టీస్టారర్ సినిమాలు అనేవి కనుమరుగైపోయాయి.
ఇప్పుడు ఈ జనరేషన్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు కలిసి చేసిన త్రిబుల్ ఆర్ సినిమాతో మళ్ళీ మల్టీ స్టారర్ సినిమాలకి పునాది పడిందనే చెప్పాలి. ఈ సినిమాలతో ఇండస్ట్రీలో స్టార్ హీరోలు కూడా కలిసి సినిమాలు చేస్తే సూపర్ డూపర్ సక్సెస్ అందుకోవచ్చు అనే భావన అందరిలో కలిగింది. ఇక అందులో భాగంగానే త్రిబుల్ ఆర్ సినిమాలో కలిసి నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అనే విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ లో రామ్ చరణ్ కి నచ్చని విషయం ఏంటి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ ఎనర్జీ అంటే రామ్ చరణ్ కి చాలా ఇష్టమట.
ఎంతసేపు సెట్లో కష్టపడ్డా కూడా ఆయన అసలు అలసిపోవడట…అందుకే ఎన్టీఆర్ ఎనర్జీ అంటే తనకు చాలా ఇష్టమని చరణ్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర ‘ సినిమాతో ప్రేక్షకుల రాబోతుంటే, రామ్ చరణ్ మాత్రం ‘గేమ్ చేంజర్’ సినిమాతో మరోసారి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకోవడానికి రెడీ అవుతున్నాడు.
ఇక దాంతో పాటుగా రీసెంట్ గా బుచ్చిబాబు డైరెక్షన్ లో చేయాల్సిన సినిమా కూడా ముహూర్తం జరుపుకుంది. ఇక తొందర్లోనే సెట్స్ మీదకి వెళ్లడానికి రెడీగా ఉంది. ఇక ఈ సినిమాలో జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు…