Rajamouli-Mahesh Babu Movie: రాజమౌళి ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్నాడు. భార్య రమా, కొడుకు కార్తికేయతో పాటు అక్కడకు వెళ్లారు. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలు జపాన్ లో విశేషంగా ఆదరణ దక్కించుకున్నాయి. దీంతో రాజమౌళికి జపాన్ లో డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. రాజమౌళిని గుర్తు పడుతున్న జపాన్ ప్రజలు ఆయనతో ఫోటోలు దిగుతున్నారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ మీడియాతో ఆయన ముచ్చటిస్తున్నారు. తన అప్ కమింగ్ మూవీ ఎస్ఎస్ఎంబీ 29 గురించి ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నారు.
ఈ మూవీ స్క్రిప్ట్ పూర్తి చేశాము. పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరలో మొదలుకానున్నాయని రాజమౌళి చెప్పారు. కాగా ఈ ప్రాజెక్ట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. ఈ పాన్ వరల్డ్ మూవీలో హృతిక్ రోషన్(Hrithik Roshan) నటిస్తున్నాడట. ఆయనను ఓ గెస్ట్ రోల్ కోసం సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. హృతిక్ రోషన్ బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరోగా పేరుగాంచాడు. ఇక సౌత్ ఇండియాలోనే అందమైన హీరోగా మహేష్ బాబు ఉన్నారు. ఈ ఇద్దరు మోస్ట్ హ్యాండ్సమ్ హీరోలు ఒక చిత్రంలో నటిస్తున్నారంటూ కథనాలు వెలువడుతున్నాయి.
అయితే ఎస్ఎస్ఎంబీ 29లో హృతిక్ రోషన్ నటిస్తున్నాడు అంటూ ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇది కేవలం రూమర్ మాత్రమే. అలాగే రాజమౌళి తమ చిత్రంలో నటులను ఇంకా ఫైనల్ చేయలేదు అన్నాడు. హృతిక్ రోషన్ నటిస్తున్న మాట నిజమైనా కూడా అది చర్చల దశలో ఉండొచ్చు. అధికారికంగా ఫైనల్ కాలేదు. హృతిక్ రోషన్ ప్రస్తుతం వార్ 2లో నటిస్తున్నాడు. ఈ మూవీలో ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. హృతిక్ రోషన్-ఎన్టీఆర్ ల మల్టీస్టారర్ గా వార్ 2 చిత్రాన్ని అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు.
ఇక ఎస్ఎస్ఎంబీ జంగిల్ అడ్వెంచర్ డ్రామా. ఇండియానా జోన్స్ ని తలపించేలా ఉంటుందని రాజమౌళి తెలిపారు. ఇక మహేష్ ప్రపంచాన్ని చుట్టే సాహస వీరుడిగా కనిపిస్తాడట. హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేసే అవకాశం కలదు. నిర్మాత కేఎల్ నారాయణ రూ. 800 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించనున్నారట. రాజమౌళి కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో ఎస్ఎస్ఎంబీ 29 తెరకెక్కనుంది. ఆర్ ఆర్ ఆర్ తో గ్లోబల్ ఫేమ్ పొందిన రాజమౌళి… గత చిత్రాలకు ధీటుగా దీన్ని తెరకెక్కించనున్నారు.