Pawan Kalyan: ఇండస్ట్రీలో పవన్ కల్యాణే నెంబర్ వన్ హీరో అంటున్న కుర్ర హీరో…

ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో గురించి ప్రస్తావన వచ్చింది. దాంతో ఆయన ఇండస్ట్రీ లో ఇప్పుడు నెంబర్ వన్ హీరో పవన్ కళ్యాణ్ అని తను ఓపెన్ గా చెప్పాడు.

Written By: Gopi, Updated On : March 21, 2024 12:07 pm

Pawan Kalyan one hero in Tollywood

Follow us on

Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ మెగాస్టార్ చిరంజీవి కి ఉన్న క్రేజ్ ను బీట్ చేసే హీరో మరొకరు లేరని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అయితే చిరంజీవి తర్వాత ఇండస్ట్రీలో టాప్ హీరో ఎవరు అనే దానిమీద చాలా రోజుల నుంచి చర్చలైతే జరుగుతున్నాయి. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెబుతున్నప్పటికీ, టాలీవుడ్ యంగ్ హీరో అయిన నాగశౌర్య(Naga Shourya) మాత్రం ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో పవన్ కళ్యాణ్ మాత్రమే అని చెప్పడం విశేషం..

ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో గురించి ప్రస్తావన వచ్చింది. దాంతో ఆయన ఇండస్ట్రీ లో ఇప్పుడు నెంబర్ వన్ హీరో పవన్ కళ్యాణ్ అని తను ఓపెన్ గా చెప్పాడు. ఆయన సినిమాల మీద ఎక్కువగా దృష్టి పెట్టడం లేదు కానీ, తను ఫోకస్ చేస్తే మాత్రం ఇండస్ట్రీ లో నెంబర్ వన్ గా హీరో తనే అని చెప్పాడు. ఇక అప్పట్లో ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దాంతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మీద ప్రతి ఒక్కరి ఫోకస్ అనేది పెరిగింది.

ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ లో బిజీగా ఉన్నప్పటికీ సినిమాలను మాత్రం ఎక్కడ వదలకుండా అవకాశం దొరికిన ప్రతిసారి సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇక రీసెంట్ గా ఆయన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకి డబ్బింగ్ చెప్పిన విషయం కూడా మనకు తెలిసిందే. ఇక ఆ సినిమా నుంచి ఆయన వదిలిన గ్లిమ్స్ ఇప్పుడు పొలిటికల్ హీట్ ని పెంచుతుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో మరోసారి తను ఇండస్ట్రీ హిట్ కొట్టబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమా ఇచ్చే సక్సెస్ తో వరుస సినిమాలని లైన్ లో పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక దాంతో పాటుగా ఓజి సినిమాతో కూడా ఈ సంవత్సరం సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. చూడాలి మరి పవన్ కళ్యాణ్ ఈ సంవత్సరం ఈ రెండు సినిమాలతో ఎంత పెద్ద భారీ విజయాన్ని సాధిస్తాడో…