Jr NTR: ఎన్టీఆర్ తన భార్యను ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా… సో క్యూట్ కదా!

భార్య లక్ష్మి ప్రణతి అంటే ఎన్టీఆర్ కు అమితమైన ప్రేమ. సందర్భం వచ్చిన ప్రతిసారీ భార్య పై తనకున్న ప్రేమను చాటుతూ ఆదర్శంగా నిలుస్తుంటాడు.

Written By: S Reddy, Updated On : April 2, 2024 1:47 pm

what NTR fondly calls his wife

Follow us on

Jr NTR: టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఎన్టీఆర్ ఒకరు. పరిశ్రమలో అంచెలంచెలుగా ఎదుగుతూ గ్లోబల్ స్టార్ రేంజ్ కి వెళ్ళాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ ఫేమ్ ఎల్లలు దాటింది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భారీ ప్రాజెక్టు చేస్తున్నారు. కాగా ఎన్టీఆర్ ప్రొఫెషన్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఫ్యామిలీ కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఏ మాత్రం విరామ సమయం దొరికినా భార్య, పిల్లలతో వెకేషన్స్ కి వెళ్తూ ఉంటారు. పిల్లలతో ఆడుకోవడం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

పైగా భార్య లక్ష్మి ప్రణతి అంటే ఎన్టీఆర్ కు అమితమైన ప్రేమ. సందర్భం వచ్చిన ప్రతిసారీ భార్య పై తనకున్న ప్రేమను చాటుతూ ఆదర్శంగా నిలుస్తుంటాడు. ఆమెకు భారీ సర్ప్రైజ్ లు, గిఫ్ట్ లు ఇస్తూ ఉంటారు. అంత ప్రేమగా చూసుకునే భార్యను ఎన్టీఆర్ ముద్దుగా ఏమని పిలుస్తారో తెలుసుకోవాలనే ఆత్రుత ఫ్యాన్స్ లో ఉంది. తాజాగా ఆ సీక్రెట్ రివీల్ అయింది. ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతిని అమ్ములు అని పిలుస్తారట.

మార్చి 26న లక్ష్మీ ప్రణతి పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ విషెస్ చెప్పారు. హ్యాపీ బర్త్ డే ” అమ్ములు ” అని ముద్దు పేరుతో పిలిచారు. దాంతో ఎన్టీఆర్ తన భార్యను ముద్దుగా ఎలా పిలుస్తాడు అనే విషయం వెలుగులోకి వచ్చింది. 2011 లో లక్ష్మి ప్రణతి – ఎన్టీఆర్ ల వివాహం జరిగింది. వీరికి ఇద్దరు అబ్బాయిలు. పేర్లు అభయ్ రామ్, భార్గవ్ రామ్. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.

దేవర సినిమా ద్వారా జాన్వీ కపూర్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. కాగా దేవర చిత్రం అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.అలాగే బాలీవుడ్ మూవీ వార్ 2 లో ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది హృతిక్-ఎన్టీఆర్ ల మల్టీస్టారర్. నెక్స్ట్ కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చిత్రం చేస్తాడు. వరుసగా భారీ ప్రాజెక్ట్స్ చేస్తూ ఎన్టీఆర్ అంచనాలు పెంచేస్తున్నాడు.